Home Breaking దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద వివక్ష, కెసిఆర్ కు వంశీ 16 ప్రశ్నలు

దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద వివక్ష, కెసిఆర్ కు వంశీ 16 ప్రశ్నలు

260
0
(చల్లా వంశీచంద్ రెడ్డి)
ఇయ్యాల కేసీఆర్ అసమర్ధ, నియంతృత్వ, అహంకార పాలనలో నీళ్లు ఆంధ్రోళ్లకు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్ ఇంటి పాలైతున్నవి.
కేసీఆర్ అహంకారం వల్ల, అంతా నాకే తెలుసు అని భావన వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది.
మరీముఖ్యంగా సాగునీటి రంగంలో కేసీఆర్ వ్యవహారం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది.
పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణను ఎడారిగా మార్చి రాయలసీమను రతనాలసీమగా మార్చే కుట్ర.

ట్రంప్ గోలీ హైడ్రాక్సిక్లోరోక్విన్ ని నిషేధించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది.  దక్షిణ తెలంగాణ అన్యాయానికి కేసీఆర్ అసమర్థత, అహంకారమే కారణం.
దక్షిణ తెలంగాణ ప్రోజెక్టుల వివక్షపై, కేసీఆర్ నిర్లక్షంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
బహిరంగ చర్చకు కేసీఆర్/తెరాస ఎవ్వరిని, ఎప్పుడు, ఎక్కడికి పంపినా మేము సిద్ధం
కేసీఆర్ కి మా సూటి ప్రశ్నలు
1. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 11000 క్యూసెక్కుల నుంచి 44000కు 2005 పెంచినప్పుడు మీరు మీ మంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదు?
2. ఆంధ్రోళ్లు మన కృష్ణా బేసిన్ నీళ్లను కృష్ణేతర బసీన్లకు తరలించుకుపోతుంటే ఎందుకు ఉద్యమించలేదు?
3. సామర్ధ్యం పెంచినప్పుడు పాత పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ హామీ ఇచ్చినప్పటికీ, మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పాత 4 తూములు ఎందుకు మూయించలేదు?
4. మే 5 నాడు ఆంధ్రప్రదేశ్ GO 203 విడుదల చేస్తే, మీకు స్పందించడానికి వారం రోజులు ఎందుకు పట్టింది?
5. పోతిరెడ్డిపాడు వద్ద టెలీమెట్రి మిటార్లను ఎందుకు అమర్పించలేక పోయినరు?
6. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వరద దినాలు 30 రోజులని నిర్ధారించిన తరువాత మీరు 60 వరద దినాలుగా ఎందుకు ప్రోజెక్టుల రూపకల్పన చేసినారు? పోతిరెడ్డిపాడు సామర్ధ్యం 11000 నుంచి 44000 పెంచిందే వరద దినాలు 45 నుంచి 30కి తగ్గినందుకు కదా? మీ అపార తెలివి ఏమైంది?
7. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో GO 72 ద్వారా జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే దాన్ని తుంగలో తొక్కడం మీ అహంకారం కాదా?
8. మీరు ముఖ్యమంత్రి అయినంక రోజు 3 టీఎంసీ లు ఎత్తిపోస్తూ రూ. 32,200/కోట్లతో మిరే ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆ ఇండియా ద్వారా డీపీఆర్ చేయించి ఎందుకు పక్కన పెట్టినారు?
9. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా వ్యవసాయానికి (120), త్రాగునీటికి (20), పరిశ్రమలకు (5) మొత్తం 145 టీఎంసీ లు అవసరమున్న GO 105 కేవలం 90 టీఎంసీ లకే ఎందుకు ఇచ్చినారు?
10. మీ మహబూబ్నగర్ నాయకులందరూ PRLIS కి మూడు టీఎంసీలు కేటాయించమని మీకు 22.02.2016 న ఉత్తరం రాస్తే మీరు ఎందుకు స్పందించలేదు?
మీకు తెలివిలేదా? మీ మహబూబ్నగర్ లీడర్లకు తెలివిలేదా?
11. డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో సంబంధం లేకుండా నీళ్లు కేటాయిద్దాం అని మిరే నిండు శాసనసభలో 31 మార్చ్ 2015 న చెప్పి, మిరే PRLIS నర్లపూర్ నుంచి నీటి కేటాయింపుకు 24.09.2016 నాడు GO 806 విడుదల చేయడంలో మర్మమేంది?
12. ఇరిగేషన్ నిపుణులందరు వ్యతిరేకించినా పాలమూరు-రంగారెడ్డి లోని ఉపరితల పంపు హౌస్ డిజైన్ మార్చి భూగర్భ పంపు హౌస్ కి మార్చలేదా? ఇది మీ కాసుల కక్కుర్తి కోసం కాదా?
13. మీరు శాసనసభలో 31.03.2016 నాడు హామీయిచ్చిన KLI 20 టీఎంసీల రెజర్వాయర్లు ఎక్కడ మాయం ఐనవి?
14. జూరాల నుంచి పకాలకు మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలను చీల్చుకుంటూ గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోవొచ్చు. జూరాల-పాకాల కట్టి తిరుతం అని శాసనసభలో హామీ ఇచ్చి 02.08.2014 నాడు GO కూడా విడుదల చేసి ఎందుకు వెనక్కి పోయినరు? శాసనసభలో హామీ ఇచ్చినప్పుడు మీ తెలివి ఏమైంది? గ్రావిటీ కన్నా లైఫ్తుల ద్వారా ఐతే ఎక్కువ కమిషన్లు వొస్తవనా?
15. మీరు ఇప్పుడు మాట్లాడే SLBC టన్నెల్ పనులు మొత్తనికే ఎందుకు ఆగిపోయినవి?
16. KLI, PRLIS, DLIS, RDS, తుమ్మిళ ప్రాజెక్టులు మీరే కుర్చీ ఏసుకొని కట్టిస్తా అన్నారు కదా? సమయం లేదా? కుర్చీ దొరకలేదా?
పాలమూరు-రంగారెడ్డి మొదటి పంపు హౌస్ రీడిజైన్ చాలా పెద్ద బాగోతం. పెద్ద స్కాం, తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించే అంశం. దీన్ని బహిరంగ చర్చలో వివారిస్తా
బహిరంగ చర్చకు వొస్తే ఇంకా లోతుగా కేసీఆర్ బండారం బయటపెడతాం.

(వంశీ చంద్ రెడ్డి హైదరాబాద్ లో  విలేకరుల సమావేశంలో లేెవనెత్తిన ప్రశ్నలు)