బెంగుళూరులో డా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద మొదటి గుండె మార్పిడి సక్సెస్

పొరుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రోగులు చేయించుకునే శస్త్ర చికిత్సలకు ఆరోగ్యశ్రీని వర్తింపచేశాక తొలి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒకరోగికి బెంగుళూరులోని  ఆసుప్రతిలో వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ కింద గుండె మార్పిడి విజయవంతంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం, తొలిసారిగా ఆరోగ్యశ్రీ పథకం క్రింద మే, 2016 సం.లో గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలు అనే గుండె వ్యాధిగ్రస్తునికి జరిగింది. అపుడు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల  ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
గత నాలుగు సంవత్సరాలలో ఆరోగ్యశ్రీ పథకం క్రింద మూడు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహించడం జరిగింది.
అయితే,  డా. వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని, పొరుగు రాష్ట్రాల ముఖ్య నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లలోని కార్పొరేట్ ఆసుపత్రులకు ఈసేవలను విస్తరింపచేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.  అక్కడి సూపర్ స్పెషాలిటీ విభాగాలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందించడం కొరకు నవంబర్ 1, 2019 నుండి డా. వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ సేవలు వినియోగం లో భాగంగా మొదటిసారిగా చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ, అంజమ్మ  కుమారుడైన ఏ. ఆనంద్ (26) కి గుండె మార్పిడి శస్త్ర చికిత్సజరిగింది. ఆనంద్ గత నాలుగు సంవత్సరాలుగా గుండె వ్యాధితో (dilated cardiomyopathy, severe LV dysfunction, EF-15%) బాధ పడుతున్నాడు.
అతనికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వారు నిర్ధారించారు.
డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, సీఈఓ డా.మల్లికార్జున, బెంగళూరు సమన్యాయ కర్త డా.ఉప  సహాయంతో బెంగళూరు వైదేహి ఆసుపత్రి లో  ఆనంద్ చికిత్సకు ఏర్పాట్లు చేశారు.
ఆగస్టు 28 న గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణులు ప్రొఫెసర్ & హెచ్.ఓ.డీ.. డా.దుర్గా ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో ఆనంద్ కు గుండె మార్పిడి శస్త్రచికిత్స జయప్రదంగా  జరిగింది
ఆద్యంతము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాణాధికారి ఐన డా.ఏ. మల్లికార్జున గారు బెంగళూరు సమన్వయ కర్త డా.ఉష పర్యవేక్షిస్తూ వచ్చారు.
ఆరోగ్యశ్రీ పథకం నందు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్యాకేజీ ననుసరించి పదకొండు లక్షల రూపాయల మొత్తాన్ని రోగికి ఖర్చు ఆరోగ్యశ్రీ ట్రస్ట్వైదేహి ఆసుపత్రికి అందిచడం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆనంద్ కు ఆరోగ్య శ్రీ పథకం క్రింద ఉచిత గుండె మార్పిడి శస్త్రచికిత్స అందించడం జరగింది.
ఆపరేషన్ జరిగిన ఐదవ రోజున కోలుకొని తనకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె మార్పిడి జరిగి ప్రాణదానం చేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి,ఆసుపత్రి వైద్య సిబ్బందికి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆనంద్ కృజ్ఞతలు తెలిపారు.
(ప్రెస్ నోట్)