తెలంగాణలో తొలి కరొనా మృతి, పాజిటివ్ కేసులు 65

తెలంగాణ లో  కరోనా వ్యాధితో ఒక వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇదే విధంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 65 కు చేరుకున్నాయి.  కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా పరిస్థితి మీద ఈ రోజుమూడు సార్లు సమీక్షించారని ఈటెల వెల్లడించారు.
మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించని విషయాలు:
కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయి.  కొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము . సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఇవ్వాళ కొత్తగా 6 కేసులు కొత్తగా వచ్చాయి .
సీరియస్ కండిషన్ లో ఒక వ్యక్తి  గ్లోబల్ హాస్పిటల్ లో చేరారు.మరణించిన తరువాత తెలిసింది అతనికి కొరొనా వచ్చిందని. అతను పాజిటివ్ అని తేలింది.
ఏ హాస్పిటల్ లో ఎలాంటి సమస్య లేదు. కొరొనా పై తప్పుడు ప్రచారం చేయకండి. ఇప్పటి వరకు 65 కు కొరొనా కేసులు నమోదు
* ఎంతమంది కొరొనా రోగులు ఉన్నా ట్రీట్మెంట్ అందిస్తాం.
* కావాల్సిన యంత్రపరికారాలు అన్ని అందుబాటులో తెస్తున్నాము.
* 6 రోజుల్లో గచ్చిబౌలి లో స్పోర్ట్స్ కాంప్లెక్  ఐసోలేషన్ వార్డగా రెడీ అవుతుంది.
* గాంధీ వైద్యులను వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరు ఇబ్బంది పెట్టొద్దు.
* అలాంటి వైద్యులకు అండగా ఉండాలి.
* క్వారంటాయిన్ లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుంది.  ఒక్క వ్యక్తికి వస్తే కుటుంబం అంతా వచ్చే ప్రమాదం ఉంది.
* విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలి.  సీఎం ఆదేశాలతో 24 గంటలు ఆన్ డ్యూటీ లో ఉంటున్నాము. హైదరాబాద్ లో ఎక్కడ రెడ్ జోన్ లేదు.
* ప్రార్థన మందిరాల్లోకి ప్రజాలేవరూ వెళ్ళకండి.  ఇవ్వాళ నమోదు అయిన కేసుల్లో మూడు కేసులు ఢిల్లీ ప్రార్థన మందిరాల్లోకి వెళ్లిన వారివే.
* వైద్యులు-ఎయిర్ పోర్ట్ లోని స్క్రినింగ్ లో పనిచేసే సిబ్బంది- వారి కుటుంబాలకు కొరొనా సోకింది.  రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది-వ్యక్తులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.  వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్ లాగా విధులు నిర్వహించే లాగా ఏర్పాటు చేస్తాం. వైద్యులకు అవసరం అయితే…10 రోజులు విధులు..మరో పది రోజులు లీవ్ ఇస్తాము.
రాష్ట్రంలో ప్రస్తుతం క్వారంటైన్  లో 13వేల మంది ప్రస్తుతం ఉన్నారు. అయితే,  రోజు రోజుకు క్వరంటాయిన్ లో సంఖ్య తగ్గుతుంది.