ప్రపంచంలో అతి పిన్నవయసు ప్రధాని ఈమే

సన్నా మారిన్ (34) ఫిన్లండ్ ప్రధాని అయ్యేందుకు రంగం సిద్ధమయింది. ఆమె బాధ్యతలు స్వీకరించగానే ప్రపచంలో అతి పిన్నవయసు ప్రధాన మంత్రి అవుతారు.
అయిదు రాజకీయ పార్టీల సంకీర్ణం ఆమె ను ప్రధానిగా ఎంపిక చేశాయి. ఇందులో నాలుగు పార్టీలకు మహిళలే నాయకులు. మారిన్ సోషల్ డెమో క్రటిక్ పార్టీకి చెందిన .
ఇంతవరకు ఆమె ఫిన్లండ్ రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉండే వారు. ఆ మధ్య దేశంలో జరిగినపోస్టల్ వర్కర్స్ సమ్మెను సరైన రీతిలోదారికి తెచ్చుకోలేకపోవవడంతో ప్రధాని అంటీ రిన్నే రాజీనామా చేయాల్సి వచ్చింది. అపుడు అంతా మారిన్ ను ఎన్నుకున్నారు. ఈ నియమకాన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. మంగళవారం నాడు జరగవచ్చనుకుంటున్నారు.
 ఫిన్లండ్ లో అతి పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తి అవుతారు మారిన్. ఆదేశానికి సంబంధించి ప్రధాని అయిన మూడో మహిళ ఆమె. కొద్దిగా వామపక్ష భావాలున్న మారిన్ 2015 నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.ఆమె రాజకీయ జీవితం 2012లో టాంపియర్ సిటీ లోకల్ కౌన్సిల్కు ఎన్నికవడంతో మొదలయింది. తర్వాత ఆమె కేంద్రానికి వచ్చారు. అక్కడ ట్రాన్స్ పోర్టు, కమ్యూనికేషన్స్ మంత్రి అయ్యారు.