ఉద్ధృతం అవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పోరాటం

● కోనేటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో విద్యార్థి జెఎసి చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది
● విద్యార్థి నాయకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీక్ష విరమింపజేసిన రాయలసీమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు
● యువత ఉద్యోగ ఉపాధి కల్పన పరిశ్రమల ఏర్పాటు కోసం ఉద్యమించాలన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు
● దీక్షకు మద్దతు తెలిపిన టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, కర్నూలు జిల్లా న్యాయ వాదుల సంఘం
పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది.
నిరవధిక దీక్షలో జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన్, కో కన్వీనర్ శ్రీధర్, జెఎసి నేతలు బి భాస్కర్ నాయుడు, తరుణ్, ఎం రవి దీక్షలో కూర్చున్నారు. మూడో రోజు కొనసాగుతున్న నిరవధిక దీక్షకు టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మోహన్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రవి గువేరా, సీనియర్ న్యాయ వాడి వి. నాగ లక్ష్మి దేవి, ప్రధాన కార్యదర్శి గోపాల్ కృష్ణుడు, మాజీ అధ్యక్షుడు ఓంకార్, మాజీ ప్రధాన కార్యదర్శి గోపాల్ కృష్ణుడు, విద్యావేత్తలు టి చంద్ర శేఖర్, రామచంద్ర రెడ్డి, టి రాఘవేంద్ర, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. మద్దిలేటి యాదవ్, తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంవీన్ రాజు యాదవ్, పాణ్యం నియోజక వర్గం కన్వీనర్ ప్రవీణ్, టిడిపి జిల్లా కార్యదర్శి జేమ్స్, ప్రజా చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు క్రాంతి కుమార్, కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె రంగ స్వామి, నగర అధ్యక్షుడు తౌడు శ్రీను, లెక్చరర్ చిన్న వెంకటస్వామి మద్దతు తెలిపి మాట్లాడారు.

మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షను రాయలసీమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థి నాయకులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ…విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ఫీజు రీయింబర్స్మెంట్, తక్షణమే పెండింగ్ లో ఉన్న 2018-19 సంవత్సరానికి సంబంధించి ₹1230కోట్లు, 2019-20 సంవత్సరానికి సంబంధించి ₹3600 కోట్లు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థుల ఏ కాలేజీలో చదువుతున్నా ఆ ఫీజును పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుందనీ చెప్పి నేడు అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతున్న ఈ ఏడాది ఫీజులు ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు.
విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ సాధన కోసమే కాకుండా రాయలసీమ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థి జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థులతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బిసి విద్యార్థి యువజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి సురేష్ బాబు, విద్యార్థి నాయకులు ఎం రవి, నాగరాజు, శివ శంకర్ పాల్గొన్నారు.