అమరావతిలో కొనసాగుతున్న రైతుల నిరసన

అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజధానిప్రాంతంలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. మందడం మెయిన్ సెంటర్ వద్ద రోడ్ కు అడ్డుగా ఫ్లెక్సీలను కట్టి రైతులు తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు.
నిన్న వికేంద్రీకరణ పాలన మీద మాజీ ఐ ఎస్ అధికారి జిఎన్ రావు కమిటీ  తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తూ మూడు రాజధానులను సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో అన్ని ప్రాథమిక వసతులు ఉన్నందున ప్రభుత్వాన్ని అక్కడికి మార్చాలని కూడా  కమిటీ సూచించింది.దీనితో రాజధాని రైతులు తమ ఆందోళన ముమ్మురంచేశారు.
అమరావతి అంటే బుద్ధుడి ప్రాముఖ్యం ఉన్న ప్రదేశమని చెప్పందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇదే విధంగా అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చి శంకుస్థాపన  చేసిన విషయాన్ని కూడా వారు గుర్తు చస్తున్నారు. ఈ సందేశంతో   ఈ రోజుప్రధాని మోడీ, అమిత్ షా, పవన్కళ్యాణ్, బుద్ధుడు విగ్రహాల తో ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు.