నంద్యాల RARS భూములను తీసుకుంటే ఆందోళన : రైతుల హెచ్చరిక

ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే గ్రామ స్థాయిలో రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తారు…
అభివృద్ధి పేరుతో ప్రభుత్వం అభివృద్ధి చెంది రైతులకు అండగా వున్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (RSRS) భూములను తీసుకోవడం అన్యాయమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
శుక్రవారం నంద్యాల RARS కార్యాలయం ముందు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో వందలాది మంది రైతులు నిరసన తెలిపారు. రైతులను ఉద్దేశించి బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ 115 సంవత్సరాల ఘన చరిత్ర కలిగి అనేక నూతన వంగడాలను ఉత్పత్తి చేసి రైతులకు, నంద్యాలకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ప్రభుత్వమే నిర్వీర్యం చేయాలనుకోవడం బాధిస్తోందని అన్నారు.
నంద్యాల అభివృద్ధిని కోరుకుంటున్నామనీ, జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి కలెక్టరేట్ , S.P కార్యాలయం, మెడికల్ కళాశాల తదితర అభివృద్ధిని స్వాగతిస్తున్నామనీ వివరించారు.

ఐతే నంద్యాలకు తలమానికంగా వుంటూ రైతు అభ్యున్నతికి తోడ్పడుతున్న RARS కు చెందిన 60 ఎకరాల భూమిని మెడికల్ కళాశాల కు తీసుకోవడం వ్యతిరేకమిస్తున్నామని అన్నారు.రైతులకు సంబంధించిన నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు,నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ కి చెందిన 120 ఎకరాలు, నూలుమిల్లు కు చెందిన భూములు నిరుపయోగంగా ఉన్నా ఆభూములను తీసుకోకుండా RARS భూములను మెడికల్ కళాశాల కు తీసుకోవడం కుట్రపూరితేమని అన్నారు.రైతు ప్రభుత్వం గా చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూముల స్వాధీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని RARS- ADR, నంద్యాల R.D.O. కు వినతిపత్రాన్ని అందించడం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు Y.N.రెడ్డి, రామచంద్రారెడ్డి, అల్లీనగరం వుశేని, పాండురంగాపురం ఉమామహేశ్వరరెడ్డి, రైతునగరం రామసుబ్బారెడ్డి, కానాల కృష్ణమోహన్ రెడ్డి, నెరవాడ ప్రసాదరెడ్డి,ప్రతాపరెడ్డి, కొనిదేడు శంకరయ్య,రాంపుల్లారెడ్డి, యాళ్ళూరు చిన్న రామకృష్ణారెడ్డి,బాలతిమ్మారెడ్డి, తొగర్చేడు శ్రీనివాసరెడ్డి,శ్రీహరి, M.V.రమణారెడ్డి,మహేశ్వరరెడ్డి,సుధాకర్ రావు,మరియు నందిరైతు సమాఖ్య, రైతుసంఘాలు, వివిధ గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.