Home Breaking జుట్టు నెరిసింది, రాలింది, 70 పడ్డాయి, ఇంతకీ పార్టీ పెట్టేదెపుడబ్బా?

జుట్టు నెరిసింది, రాలింది, 70 పడ్డాయి, ఇంతకీ పార్టీ పెట్టేదెపుడబ్బా?

120
0
(జింకా నాగరాజు*)
ఈ రోజు తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ బర్త్ డే. ఆయన వయసు ఇపుడు 70 సంవత్సరాలు. అయితే, చాలా నిర్ణయాలుతీసుకుంటున్నారు.చకాచకా సినిమాలు తీస్తుపోతున్నారు. అయితే, ఒక కీలకమయిన నిర్ణయమే ఇంకా తీసుకోలేకపోతున్నారు. ఆ ఒక్క విషయంలో 70 సంవత్సరాల వయసులో ఏం చేయాలతో తోచక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆ ఒక్క విషయమేమింటటే… రాజకీయ ప్రవేశం. ఈ రోజు ప్రపంచవ్యాపితంగా ఉన్న కోట్లాది మంది రజిని అభిమానులు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అందరిలో ఒకటే ఉత్కంఠ. బాక్సాఫీసు బాద్షా, తమిళ రాజకీయ బాద్షాగా మారేదెన్నడు అని. బాద్షా రాావాలని తమిళ ప్రజలే కాదు, దేశమంతా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గిరే కాదు, బ్యాలెట్ బాక్స్ దగ్గిర కూడా బాద్షా మ్యాజిక్ చూడాలనుకుంటున్నారు.
రాజకీయాల్లోకి రావాలనుకున్న నటులు ఎవ్వరూ ఇంతగా ఊగిసలాడలేదు. భారతదేశంలో చాలా మంది నాయకులు, నటులు పార్టీలు ప రాజకీయ పార్టీలు పెట్టారు. రంగంలోకి దూకారు.  ఇంకా వస్తున్నారు.పోతున్నారు కూడా. ఇది వేరే విషయం.
ఉదాహరణకు ఆంధ్రలో చిరంజీవి చకచకా రాజకీయాల్లోకివచ్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఒక స్పష్టమయిన లక్ష్యంతోనే ఆయన పార్టీ పెట్టారు. ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కాలేదు. అనుకున్నన్ని సీట్లు రాలేదు. ఇది కూడా వేరే విషయం. అయితే, పార్టీపెట్టాలని నిర్ణయం ప్రకటించాక తదుపరి  నిర్ణయాలు చకచకా సాగిపోయాయి.
అలాగే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాక ఇక ఆగింది లేదు.
ఇలాగే కర్నాటకలో భర్త అంబరీష్  చనిపోయాక రాజకీయాల్లోకి రావాలనుకున్న సుమలత ఆగిందే లేదు. కాంగ్రెస్ వాళ్లని టికెట్టడిగింది. వాళ్లివ్వలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారుు. గెలిచారు. ఇలాంటి తెగింపు రజినీ కాంత్ లో కనిపించకపోవడమే ఆశ్చర్యం.
దానికి తోడు దేశాన్ని ఎన్నో అంశాలు కుదిపేస్తున్నా తనకేమీ పట్టనట్లు ఏమీ మాట్లాడటం లేదు. ఆర్టికల్ 370 రద్దు, ఇపుడు పౌరసత్వ సవరణ చట్టం,మొన్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం… ఇలా ఎన్నో విషయాలు దేశం ముందుకు వస్తున్నాయి.రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న రజీనీ కాంత్ ఒక్క విషయం గురించయినా తన అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు.
ఆయన ప్రతిదానికి స్పందించాలని రూలేమీ లేదు. అయితే, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వ్యక్తికి రాజకీయ దృక్పధం అలవడాలిగా. అందుకే రాజకీయ వ్యాఖ్యలు చేయడం, అభిప్రాయలు వ్యక్తం చేయడం, కీలకమయిన సందర్భాల్లోనయినా రాజకీయ ధోరణి వ్యక్తం చేయడం అవసరం.
అయితే, ఇదేమీ జరగడం లేదు. ఆయన రాజకీయ యాత్ర ‘కబాలి’లో పరోక్షంగా “Naan Vandhuttennu Sollu “ (Tell them I have arrived) దగ్గిరే ఆగిపోయింది. ఆయన  పార్టీ రాజకీయ కలాపాలతో నిండాల్సిన వార్తా పత్రికల పేజీలు సోషల్ మీడియా పోస్టులు, ఆయన రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనే చర్చతో నిండిపోతున్నాయి.
చిందర వందర అయి, అవినీతిమయమయిన తమిళ రాజకీయాల్లోకి రజనీకాంత్ వచ్చి ప్రక్షాళన చేస్తాడని దశాబ్దాలుగా ఆయన అభిమానలు వెయిట్ చేస్తున్నారు. ఆశ గా ఎదురుచూస్తున్నారు.
ఎదురు చూసి… చూసి… చూస్తుండగానే సూపర్ స్టార్ పెద్ద వాడయ్యాడు. జుట్టునెరిసింది. జుట్టు రాలి బట్టతల కూడా అయింది. సీనియర్ సిటిజన్ అయిపోయారు. 70 సంవత్సరాలు పడ్డాయి. ఆయనొస్తాడని అభిమానులు ఆశగా ఎదురచూట్టమే తప్ప ఫీల్డ్ లో ఏమీ జరగడం లేదు.
విశాలమయిన ఫ్యాన్ బేస్ ఉండి, ప్రాణాలిచ్చే అభిమానులండి, పార్టీ పెడతానని ప్రకటన చేసినా కూడా మరొక అడగు ముందుకేసేందుకు ఇంతగా తటపటాయిస్తున్న నాయకుడెవరూ భారత దేశ చరిత్రలో లేరేమో.
ఈ మధ్య, అవసరమయితే కమల్ హాసన్ తో  కలసి పనిచేసేందుకు సిద్దమని చెప్పడంతప్ప మరొక ఆశాజనకమయిన ప్రకటనే రాలేదు సూపర్ స్టార్ నుంచి.
పార్టీకొక పేరుపెట్టాలన్న ఆదర్దా కూడా ఆయనలో కనిపించడం లేదు. అయితే, సినిమాలేమో విడుదలవుతునే ఉన్నాయి. ఇపుడు దర్బార్ విడుదలకు సిద్ధమవుతూ ఉంది. తర్వాత మరొక చిత్రం తలైవా 168 కూడా రూపుదిద్దు కుంటూ ఉందని చెబుతున్నారు. ఆయన పార్టీ గురించి ఇలాంటి వూహాగానాలు కూడా రావడం లేదు. అదీ సంగతి…

(*Jinka Nagaraju is a Hyderabad based senior journalist.)