నర్సులు, డాక్టర్లు కరోనా రోగుల సేవలో చనిపోవడం… ఎంత బాగుందో : ట్రంప్

వర్షంలో పూల మొక్కల తడిచి పులకించడం చూడ్డానికి ఎంత ఆందంగా ఉందో అంటాం.చిన్నపిల్లలు వర్షపు జల్లులు తడిసి  చిందులేయడం, చూడ్డానికి అందంగా ఉందంటా. సూర్యోదదం, సూర్యాస్తమచం, చందమామ, చెంగు చెంగున ఎగిరే లేగదూడలు… చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో అంటాం.
చుట్టూల శవాల మధ్య కొనవూరిపితో ఉన్న రోగుల మధ్య, వాళ్లను బతికించేందుకు సతమతమవుతూ ఆ రోగం తగులుకుని చనిపోతూంటే…చూడ్డం అందమయిన అనుభవం అని ఎవరైనా అంటే.. వాడికి పిచ్చి పట్టిందనాలి. అమెరికా వాళ్ళ దురదృష్టం , అలా మాట్లాడే వ్యక్తి అమెరికా కు అధ్యక్షుడు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్లు నర్సలు, కరోనారోగుల సేవలో చనిపోవడం … అదొక అందమయిన అనుభవం  అన్నాడు..  ఇంగ్లీష్ దేశంలో పుట్టి, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజీలో చదువుకుని అంత పెద్ద వ్యాపారసామ్రాజ్యాన్ని నిర్మించుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇంత పూర్ వొకేబులరీ వుందని అనుకోలేం.దీని భావ దారిద్య్రం అని కొట్టి పడేయం లేం. అంతకొటే ఏదో పెద్ద  సమస్య అతగాడిని పీడిస్తూ ఉండాలి.
ఆయన ఈ ప్రసంగం వీడియో వౌరస్ అయిపోయింది. ఈ వీడియో లో ట్రంప్ అన్నమాటలు ఇవి: “Doctors and nurses, are running into death just like soldiers run into bullets…It’s a beautiful this to see.”
అయితే, ఆయన్ని నిజంగానే ’ప్రమాదకరమయిన‘ వ్యాధులు పీడిస్తూ ఉన్నమాట నిజమే అంటున్నా పేరు మోసిన అమెరికా సైకియాట్రిస్టులు.

 

 

అమెరికాలో పేరుమోసిన విశ్వవిద్యాలయాలకు చెందిన అనేక సైకియాట్రి స్టు, సైకాలజిస్టుల ఏకంగా ఒక ప్రకటన చేస్తూ  ట్రంప్ కు చాలా సీరియస్ మానసిక జబ్బులున్నాయని చెప్పారు. అయన దేశాధ్యక్ష పదవికిసరిపోడని వారు ప్రకటించారు. యోల్ (Yale University)లో  జరిగిన ఒక సదస్సుకువచ్చిన సైకియాట్రిస్లు  ట్రంపుకు “dangerous mental illness” ఉందని హెచ్చరించారు,
ట్రంపు పేరనాయిడ్ అని పిచ్చికలలు కంటున్నాడని చెబుతే ఆయన మానసిన రుగ్మతలకు గురించి అమెరికా ప్రజలను హెచ్చరించడం తమ నైతక బాధ్యత గా భావిస్తున్నామని వారు ప్రకటించారు.
గురువారం నాడు Yale School of Medicine లో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ప్రముఖ సైకోథెరిపిస్టు డాక్టర్ జాన్ గార్ట్ నర్, ‘అమెరికా అధ్యక్షుడికి ఉన్న ప్రమాదకరమయిన మానసిక జబ్బుల గురించి అమెరికన్లను హెచ్చరించడం మా నైతిక బాధ్యత,’ అని అన్నారు. డాక్టర్ గార్ట్ నర్ చాలా కాలం జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ సైకియాట్రి రెసిడెంట్స్ కు సలహాదారుగా కూాడా ఉన్నారు.
ఆయన డ్యూటీ టు వార్న్ (Duty to Warn) అనే సంస్థకు సంస్థాపక అధ్యక్షుడు కూడా. ఇందులో ఎంతో మంది పేరు మోసి సైకియాట్రిస్టులు సభ్యులుగా ఉన్నారు. వీళ్లంతా కూడా ట్రంప్ దేశాధ్యక్షడిగా ఉండేందుకు అనర్హుడని భావిస్తున్నారు. ఒక ప్రారంభోత్సవం దగ్గిర చాలా మందిజనం ఉండాలనుకోవడం ఆయనలో ఉన్న ఒక పెద్ద సమస్యకు వార్నింగ్ అని గార్ట్ నర్ చెప్పారు.
సైకియాట్రిస్టు లేమన్నారో ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ Independent మీద క్లిక్ చేయండి