Home Breaking సిద్ధిపేట్ తెలంగాణ భవన్ కు తుదిమెరుగులు

సిద్ధిపేట్ తెలంగాణ భవన్ కు తుదిమెరుగులు

235
0
సిద్ధంగా సిద్ధిపేట జిల్లా తెలంగాణ భవన్…
– త్వరలో సీఎం కేసీఆర్ గారిచే ప్రారంభం..
– పూర్తి అయిన సిద్దిపేట జిల్లా పార్టీ కార్యలయ భవనాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండలంలోని పొన్నాల గ్రామంలో  జిల్లా  తెలంగాణ భవన్ భవన్ 9 టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం )ముస్తాభవుతూ ఉంది.  టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పూర్తయ్యే క్రమంలో ఉన్నాయి. ఈ పనులను శనివారం సాయంత్రం మంత్రి హరీష్ రావు పరిశీలించారు .జిల్లా తెలంగాణ భవన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని  త్వరలో సీఎం కేసీఆర్  జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారని ఆయన మీడియాకు  చెప్పారు.

త్వరలో జరుగునున్న ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని  అసంపూర్తి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టరును  హరీశ్ రావు కోరారు.
సిద్ధిపేట జిల్లా  తెలంగాణ భవన్ లో  మీటింగ్ హాల్ , డైనింగ్ హాల్, విడిది గదులను ఆయన పరిశీలించారు. మంత్రి వెంట తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.