కాలనీ / అపార్ట్మెంట్ అసోసియేషన్ల సభ్యులకు తెలంగాణ డిజిపి విజ్ఞప్తి

అందరం ఒక్కటిగా పని చేస్తూ, కొరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవలసిన సమయం, ఈ యొక్క అత్యవసర పరిస్థితినుండి బయటపడేందుకు బాధ్యతతో వ్యవహరించవలసిన/స్పందించవలసిన పరీక్షా సమయమని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని కాలనీ అసోసియేషన్లకు, అపార్ట్ మెంట్ల అసోసియేషన్లకు విజ్ఞప్తి చేశారు.
ఆయన ఇంకా ఏంచెప్పారంటే…
ప్రతీ కాలనీ/అపార్ట్మెంట్ అసోసియేషన్ కి, ఇద్దరు సభ్యులతో కూడిన ఒక జట్టుని ఏర్పాటు చేయాలి, వీరు ఆయా కాలనీ/అపార్టుమెంట్లో నివసిస్తున్న అన్ని కుటుంబాలను కలసి, వారిలో ప్రతీ వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి విచారణ చేయాలి, ఎవరైనా ఫ్లూ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా అని అడిగి తెలుసుకోవాలి.
ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్టు తెలిస్తే/గమనిస్తే, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియ చేయాలి లేదా 100 నెంబర్ కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలి.
దయచేసి అందరు ఈ బాధ్యతను స్వీకరించాలి, అలాగే మీ యొక్క కాలనీ/అపార్ట్మెంట్ వద్ద వ్యక్తుల అనవసర రాకపోకలను కట్టడి చేయాలి.
మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య తెలంగాణగా మార్చే ప్రయత్నంలో, మాకు మీ యొక్క సహకారం చాలా అవసరం, మీ సహకారం లేనిదే అది సాధ్యం కాదు .