తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి హెచ్చరిక

GHMC ఎన్నికలను ఆసరాగా తీసుకోని మత ఘర్షణకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని, శాంతి భద్రతలకు జిహెచ్ ఎంసి ఎన్నికల సందర్భంగా  ఆటంకం కల్పిస్తే కఠినంగా వ్యవహారిస్తామని తెలంగాణ డిజిపి కెకె మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారికి హెచ్చరిక చేసేందుకు నిన్న చార్మినార్ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు డిజిపి ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తూ మతవిద్వేషాలను రెచ్చగొట్టె ఎలాంటిప్రయత్నాన్ని సమ్మతించమని చెప్పారు.  ఈ రోజు ఆయన సీనియర్ పోలీసు అధికారులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు.
ఆయన చేసిన హెచ్చరిక వివరాలు:
గత ఆరేళ్లుగా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ పోలీసులు శాఖ విధులు నిర్వహిస్తోంది.   విద్వంసక శక్తులను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
 కొంతమంది సోషల్ మీడియా లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు పెడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు కనిపిస్తే ప్రజలు ఫిర్యాదు చేయాలి.
మూడు పోలీస్ కమిషనరేట్ లో అన్ని విభాగాల కలుపుకొని విధులు నిర్వహిస్తారు.
కమ్యూనల్ గొడవలు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం ఉంది.
ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేశారు విచారణ జరుపుతున్నారు. రోహింగ్యాల విషయంలో 60కి పైగా కేసులు నమోదు అయ్యాయి.
మత ఘర్షణలు జరిపేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు..వాళ్ళ పై మా నిఘా ఉంది. కమ్యూనల్ ఘర్షణలు చేసే వాళ్ళు అవకాశం కోసం చూస్తారు!.
రహస్య సమాచారాన్ని మేము బయటపెట్టలేము..అవసరం అనుకున్నప్పుడు యాక్షన్ ఉంటది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *