Home Breaking తిరుమల దర్శనాల సంఖ్య పెంచుతున్నటిటిడి, ధైర్యానికి కారణమేమిటి?

తిరుమల దర్శనాల సంఖ్య పెంచుతున్నటిటిడి, ధైర్యానికి కారణమేమిటి?

259
0
ఆంధ్రప్రదేశ్ లో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నాయ్. విజయవాడను ఈరోజు  నుంచి వారం రోజులు పాటు లాక్ డౌన్ తో మూసేస్తున్నారు. అలా అనంతపురం లోని అనేక ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంంతాల్లో కూడా లాక్ డౌన్ విధించారు. తుర్పుగోదావరి జిల్లాలలో కూడా లాక్ డౌన్ పాక్షికంగా అమలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఒక శాసన సభ్యుడు కరోనా పాజిటివ్ అని తేలింది. గత 24 గంటలలో గతంలో ఎపుడూ లేనంతగా 553 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం కరోనా కేసులు 10,884 చేరాయి. మృతుల సంఖ్య136 కు చేరంది.
దేశమంతా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన చెందిన రైల్వే శాఖ ప్రారంభించిన రైళ్లన్నింటిని రద్దు చేసింది.రెగ్యులర్, మెయిల్, ఎక్స్ ప్రెప్ ప్యాసింజర్ రైళ్లను ఆగస్టు 12 దాకా బంద్ చేశారు. ఇపుడు అమలులో ఉన్న లాక్ డౌన్ గడువు ఈ నెలాఖరున ముగుస్తుందని, ఇంకా పెద్ద సంఖ్యలోరైళ్లు తిరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నపుడు  ఇలా రైళ్లాగిపోయాయి. ఇక తెలంగాణలో  కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తవ్వేకొద్ది బయటపడుతున్నాయి. చివరకు కరోనా టెస్టలు చేసే కెపాసిటీ చాలనంతగా  కోవిడ్ శాంపిల్స్ పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం  రెండు రోజులు శాంపిళ్ల సేకరణ అపేసింది.  ఇదీ సర్వత్రా కరోనా పరిస్తితి.
అయినా, పర్వాలేదు, మేం శ్రీవారి దర్శనాలను ఆపే ప్రసక్తి లేదని తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) అధికారులు ప్రకటించారు.18 రోజుల కిందట టిటిడి శ్రీవారి దర్శనాలను పునరుద్ధరించింది. గంటకు 500 మంది చొప్పున కోవిడ్ నియమాలు పాటిస్తూ భక్తులను అనుమతిస్తున్నారు. ఇపుడు భక్తుల సంఖ్యను గంటలకు 800లకు పెంచాలని టిటిడి నిర్ణయించింది. అంటే రోజుకు  దాదాపు 12000 మంది భక్తులను తిరుమలకు అనుమితిస్తారు. ఈ విషయాన్ని టిటిడి అడిషనల్ ఇవొ ఎవి ధర్మారెడ్డి  ప్రకటించారు.
టిటిడి ధైర్యానికి కారణం, గత 18 రోజులుగా వేలాది మంది భక్తులు తిరుమల సందర్శించినా ఒక్క పాజిిటివ్ కేసుకూడా కనిపించలేదు. ‘తిరుమల వచ్చేభక్తులకు అనేక చోట్ల థర్మల్ స్క్రీనింగ్ చేయడం, బాగా శానిటేషన్ ఏర్పాటు అమలుచేయడం, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ -19 మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ ఉండటం దీనికి కారణం,’ అని ధర్మరావు చెప్పారు.
పెంచాలనుకుంటున్న 12వేల మంది భక్తులలో 3000 మంది  సర్వదర్వనానికి వస్తారు. మిగతావారు. రు. 300 టికెట్ అన్ లైన్ లోని కొని దర్శనాన్ని రిజర్వు చేసుకున్నారు.
తిరుమల తొలినుంచి గ్రీన్ జోన్ లోనే ఉంటున్నది.

Like this story? Share it with a friend!