ఖాజీపేటను రైల్వే డివిజన్ చేయాలి: ఉద్యమ ఏర్పాట్లు షురూ

ఖాజీ పేట జంక్షన్ డివిజన్  స్థాయికి ఉన్నతీకరించాలని డివిజన్ సాధన సమితి సభ్యలు డిమాండ్ చేశారు. డివిజన్ సాధన కోసం క్యాంపెయిన్  నిర్వహించాలని వారు నిర్ణయించారు. దీనికోసం ఆదివారం నాడు ఒక సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ విషయాలను సాధన సమితి వ్వవస్థాపకులు కర్ర యాదవ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు.  ఖాజీపేట కార్యాలయంలో జరిగిన ఈ  సమావేశానికి  తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ, “దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో అతి కీలకమైన జంక్షన్ ఖాజీపేట.  దక్షిణ మధ్య రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే జంక్షన్ కూడా ఇదే.  ఖాజీపేట్ జంక్షన్   డివిజన్ గా ఎదుగడానికి కావలసిన అర్హతలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అందువల్ల  ఈ ప్రాంత అభివృద్ధికి వెంటనే ఖాజీపేటని డివిజన్ గా ఉన్నతీకరించాలి,’ అని అన్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు ,శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు డివిజన్  సాధించడానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


డివిజన్ సాధనకోసం ప్రజాభిప్రాయం సేకరించడం జరుగుతున్నదని కూడా వెల్లడించారు. “ఇందులో  భాగంగా  ఫిబ్రవరి 21  ఆదివారం నాడు ఉదయం 11గంటలకు  ఉద్యమ కార్యచరణ కోసం సన్నాహక సదస్సు ఏర్పాటు చేస్తున్నారు.  ఖాజీ పేట రైల్వే స్టేషన్ ఎదుట గల రైల్వే కమ్యూనిటీ హాల్ లో ఈ సదస్సు జరుగుతుంది. వరంగల్ లోని అన్ని రాజకీయపార్టీల నాయ కులు ,ప్రజాసంఘాలు,కార్మిక సంఘాలు,విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు,సభ్యులు సదస్సుకు హాజరుకావాలి,’ అని  సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఖాజీ పేట రైల్వే డివిజన్ సాధన సమితి బాధ్యులు ఆంజనేయులు,డిటిఎఫ్ సీనియర్ నాయకులు గోపు సోమయ్య, వరంగల్ పౌర స్పందన వేదిక సమన్వయకర్త నల్లెల్ల రాజయ్య, జర్నలిస్టు బండి దుర్గాప్రసాద్ ,నాగరాజు ,ప్రేం కుమార్,ప్రవీణ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *