ఢిల్లీ నగరమంతా ఉచితంగా ఇంటర్నెట్…

దేశ రాజధాని ఢిల్లీ ఫ్రీ వైఫై సిటీ కాబోతున్నది. నగరమంతా ఉచితంగా వైఫై అందుబాటులోకి వస్తున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటిచింది. దీనికోసం 11 వేల వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో నాలుగు వేల హాట్ స్పాట్ లను బస్ స్టాప్ లలో ఏర్పాటుచేస్తారు. డిసెంబర్ 16న మొదటి 100 హాట్ స్పాట్ల లను ప్రారంభిస్తారు. ఇలా ఢిల్లీని ఉచిత వైఫై నగరంగా మార్చేందుకు సుమారు రు. 100 కోట్లు ఖర్చువుతాయని అంచనా.
ఈ పథకానికి ఆగస్టులో ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం ప్రకారం ఢిల్లీ ప్రజలు నెలకు 15 జిబిల డేటాను ఉచితంగా వాడుకోవచ్చు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో వేయి హాట్ స్పాట్ లను ఏర్పాటుచేస్తారు. పబ్లిక్ -ప్రైవేట్ పార్ట్ నర్ షిఫ్ మోడెల్ అవుతున్న ఈ పథకంలో వైఫై హాట్ స్పాట్ కు 50 మీటర్ల వ్యాసార్థం వరకు 200 ఎమ్ బిపిఎస్ స్పీడు అందుబాటులో ఉంటుంది. ప్రతియేటా ప్రభుత్వం ఈ పథకానికి వందకోట్లు కేటాయిస్తుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలలో 67 స్థానాలను గెల్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) రికార్డు సృష్టించింది. అపుడు బిజెపికి కేవలం రెండుమూడు సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడారాలేదు.