ఆయన ఫిజిక్స్ క్లాస్ అంటే పిల్లలు పడిచస్తారు, ఎందుకంటే…

ప్రొఫెసర్ డేవిడ్ రైట్ ఫిజిక్స్ పాఠాలు చెప్పే తీరే వేరు. 70 యేళ్ల వయసులో ఆయన డీలాపడిపోకుండా కుర్రవాడిలో ఫిజిక్స్ ప్రాక్టికల్ బోధించే తీరుతో ఆయన వర్జీనియా టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలో విద్యార్థుల్లో సూపర్ హిటయ్యారు.
అయితే, పాఠాలు చెప్పే తీరు, క్లాస్ రూంలో ఆయన ప్రయోగాల వీడియో ఒకటి ట్టిట్టర్ కెక్కి సెన్సేషన్ సృష్టించింది. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. క్లాస్ లో ఆయన టీచింగ్ టెక్నిక్ లకు ముచ్చటపడిన ఎరికా అనే విద్యార్థి ఆయన పాఠాలను వీడియో తీసి ట్విట్టర్లో పోస్టు చేశారు.
నిత్యజీవితం నుంచి ఫిజిక్స్ బోధించడంలో ఆయన దిట్ట. అందుకే ప్రయోగాలలో తానే స్వయంగా పాల్గొని, తన మీద ప్రయోగాలు చేసుకుంటూ ఆయన విద్యార్థులకు ఫిజిక్స్ చెబుతుంటారు. ముళ్ల పరుపు మీద పడుకుని ఆయన న్యూటన్ రెండో గమన సూత్రం చెబుతారు. పోగో కర్ర నుపయోగించి ఆయన భూమ్యాకర్షణ గురించి వివరిస్తుంటారు. అందుకే ఆయన పాఠాలన్ని పిల్లలకు చాలా సరదగా విజ్ఞానవంతంగా ఉంటాయి.దీనితో ఆయన ఫిజిక్స్ క్లాస్ అంటే పిల్లలు పడిచస్తుంటారు.
ఆయన పాఠాల మీద తీసిని వీడియో ముక్కలను జతచేసి ఎరీకా ట్విటర్ లో పోస్టు చేసింది. ఈ సెమెస్టర్ మా ఫిజిక్స్ మాస్టారు చేసి చూపించిన ఫిజిక్స్ వింతలన్నింటిని మీరంతాచూసితీరాలి. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇలా మాకోసం కష్టపడుతున్నారు,’ ఎరీకా ట్విట్ చేసింది.
డేవిడ్ రైట్ ప్రయోగాలను చూడండి: