కెసిఆర్ కు అంత అహంభావం పనికిరాదు- సిపిఐ నారాయణ స్పందన (వీడియో)

హుజూర్ నగర్ ఎన్నికల్లో సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అహంభావం పెరిగిందని సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్టీసి గురించి ముఖ్య మంత్రి చెప్పినవన్నీ అబద్దాలని, ఒక సిఎం ఇలా అబద్దాలుచెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు. నిజానికి హుజూర్ నగర్ లో టిఆర్ ఎస్ ఖర్చుచేసిన దానికి, అక్కడ చేసిన ఏర్పాట్లకు ధీటైన ఫలితం రాలేదని, ఇంకా భారీగా మెజారిటీ వచ్చి ఉండాలని ఆయన అన్నారు. కెసిఆర్ మీద నారాయణ చేసిన వ్యాఖ్యల వీడియో ఇది. చూడండి.