Home Breaking ఖమ్మంలో ఇంత ఘోరం జరిగినా రాజీ చేసే ప్రయత్నమా?: సిపిఐ నారాయణ

ఖమ్మంలో ఇంత ఘోరం జరిగినా రాజీ చేసే ప్రయత్నమా?: సిపిఐ నారాయణ

30
0
ఖమ్మంలో 13 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, తగలబెట్టిన కిరాతకుడుని ఉరికంబం ఎక్కించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.
ఈ  రోజు డాక్టర్ కె నారాయణ, పాలేరు శాసన సభ్యులు ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ మహిళా సమాఖ్య కార్యదర్శి కృష్ణకుమారి తో కలసి ఈహైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో పరామర్శించారు బాధితురాలిని పరామర్శించారు.
 ఘటన జరిగిన తర్వాత పెద్ద మనుషుల పేరుతో పంచాయితీ చేసినీవారందరిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను హత్య చేసేందుకు నిప్పుపెట్టడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 75 శాతం కాలిన శరీరంతో వున్నా పేషెంటును చట్టవిరురుద్దంగా, అనైతికంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని 15 రోజులపాటు పోలీసులకు కూడా తెలియనీయకుండా ఉంచారని చెబుతూ దీనికి  పూజా హాస్పిటల్ లైసెన్సును రద్దుచేసి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధితురాలికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి, వెల్ఫేర్ హాస్టల్లో ఆ అమ్మాయిని చదవించే బాధ్యతలను  రాష్ట్ర ప్రభుతం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.