దుర్గమ్మ భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్, గిరి ప్రదక్షిణ రద్దు

కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా  భవానీ దీక్షా విరమణకు ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు  కొండ చుట్టూ గిరి ప్రదక్షణ రద్దు చేశారు.
కోవిడ్ పరిస్థితుల వల్ల  గిరి ప్రదక్షణను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి అధికారులు ప్రకటించారు.
భవానీ దీక్షా విరణమ ఆన్ లైన్ స్లాట్ ను  దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు ఈ రోజు ప్రారంభించారు.
జనవరి 5 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు వెల్లడించారు.
కోవిడ్ వల్ల  భవానీ దీక్షవిరణమకు  వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తామని వారు తెలిపారు. అయితే, వారు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేందుకు అనుమతి లేదని వారు తెలిపారు.
అయితే,దీక్షా విరమణ రోజుల్లో రోజుకు 9 వేలు ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, 100 రూపాయల టిక్కెట్లు  వేయి దాకా  ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని,  ప్రతిభక్తుడు ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని, అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో ఐడి తప్పనిసరి చూపాలని వారు తెలిపారు.
ఆన్ లైన్ టిక్కెట్లను www.kanakadurgamma.org వెబ్ సైట్ లో పొందవచ్చు
మరిన్ని వివరాలు:
దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది.
అమ్మవారి మాల ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాలి..నదీ స్నానానికి అనుమతి ఉండదు.
రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం ఉంటుంది.
కార్తీక పార్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల కుఆలయ సిబ్బందితో అమ్మవారి గిరిప్రదక్షిణ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *