టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

మంథని మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత పుట్ట మధు భార్య శైలజకు మంథని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. పుట్ట మధు భార్య మాజీ సర్పంచ్. అప్పుడు ఉప సర్పంచ్ గా ఎనుముల సతీష్ ఉండేవారు. 2015 లో సర్పంచ్ గా ఉన్న శైలజ ఉపసర్పంచ్ సతీష్ ఇంటి పై దాడి చేసి హత్యాయత్నం చేసిందన్న అభియోగాలు ఉన్నాయి.

దీంతో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కోసం హజరు కావాలని ఎన్ని సార్లు నోటిసులు ఇచ్చినా ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో మంథని కోర్టు శైలజ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. శైలజతో పాటు అప్పటి ఎస్ ఐ షేక్ మస్తాన్, ఇద్దరు కానిస్టేబుళ్లకు కూడా న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు.

కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకే ఆమెతో పాటు మరో ముగ్గురికి వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. కోర్టు వారెంట్ తో తదుపరి రక్షణ కోసం పుట్ట మధు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం చర్చనీయాంశమైంది. పుట్ట మధు కూడా గతంలో అనేక వివాదాలపై కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *