లాక్ డౌన్ తర్వాత ఇంత స్పీడేంటి? 6,348 కి చేరిన కరోనా మృతులు

రెండునెలలు నిండుగా లాక్ డౌన్ తో దేశాన్ని బిగించి, ఊపిరితిరగకుండా ముడుచుకుని కూర్చున్నా కూడా ఎలాంటి మార్పనేది లేకుండా ఇండియాలో కరోనా కేసులు ఊహించనంత వేగంగా పెరుగుతున్నాయి.
కరోనాకేసులు ఏ రోజుకా రోజు రికార్డుసృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజున 9,851 పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. నిన్నచనిపోయిన వారి సంఖ్య 273. దీనితో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2, 26,770కి మృతుల సంఖ్య 6,348.
దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 1,10,960. ఇంతవరకు కోవిడ్ నుంచి నయమయిన వారు 1,09,461 అంటే 48.27 శాతం అన్నమాట.
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 77,793కు చేరింది.తమిళనాడులో మొత్తం 27,256 కేసులు, ఢిల్లీలో 25,004, గుజరాత్‌లో 18,584 కేసులు నమోదయ్యాయి.
నిన్న చనిపోయిన వారిలో 123 మంది మహారాష్ట్ర కు చెందిన వారు. ఢిల్లీకి చెందిన వారు 44 , గుజరాతీయులు 33, ఉత్తర ప్రదేశ్కు చెందిన వారు 16, తిమిళనాడు వారు 12, ప.బెంగాల్ వారు 10, తెలంగాణ, మధ్య ప్రదేశ్ నుంచి అరేసిచొప్పున ఉన్నారు. కర్నాటక, బీహార్, రాజస్థాన్ లనుంచి ముగ్గురేసి ఉంటే, ఆంధ్ర కేరళల నుంచి ముగ్గురేసి ఉన్నారు. ఇకఉత్తరాఖండ్ నుంచి ఇద్దరు,జమ్ము-కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్ లనుంచి ఒక్కొక్కరు మృతి చెందారు.
దేశంలో సంభవించిన కరోనా మరణాలలో మహారాష్ట్ర వాటాయే ఎక్కువ. అక్కడ 2,710 మంది చనిపోయారు. తర్వాతి స్థానంలో 1,155 తో గుజరాత్, 650తో ఢిల్లీ, 377తో మధ్య ప్రదేశ్ ఉన్నారు. ఆపైన పశ్చిమ బెంగాల్ 355 మంది చనిపోయారు. ఇతర రాష్ట్రాలలకు సంబంధించి తమిళనాడులో 220, ఉత్తరప్రదేశ్ లో 245, రాజస్థాన్ లో 213, తెలంగాణలో 105, ఆంధ్రలో 71 మంది చనిపోయారు. కర్నాటకలో 57 మంది, పంజాబ్ లో 47 మందిచనిపోయారు.