షాక్… షాక్ … రుపాయ పతనం, స్టాక్ మార్కెట్ కుదేల్

కరోనా వైరస్ దెబ్బకు ఎస్ బ్యాంక్ బాగాతాలు,క్రూడాయిల్ం పతనం తోడవడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇండియన్ ఈక్విటీలు ఇటీవల ఎప్పుడూ లేనంతగా పనతమయ్యాయి.గత రెండున్నర సంవత్సరాలలో ఆర్జించుకన్నదంతా కొట్టుకుపోయింది. స్టాక్ మార్కెట్ పనితీరుకు సూచనగా ఉన్న 30-షేర్ ఇండెక్స్ 1,941.67 పాయింట్లు పతనమయి 35,634.95 పాయింట్ల (5.17 శాతం) దగ్గిర ఆగింది. ఇక నిఫ్టీ-50 విలువల 53 పాయింట్లు పతనమయి 10,451.45 కు కూలిపోయింది. ఒక దశలో 30-షేర్ 2400 పాయింట్ల దాకా పడిపోయింది. ఇందులో బెంచ్ మార్క్ సూచికలే తీవ్రంగా నష్టపోయాయి. అంటే ఫారిన్ ఫండ్స్ అన్నీ వెనక్కు వెళ్లిపోయాయి.
ఇన్వెస్టర్లు దాదాపు రు.6.5 లక్షల కోట్లు కోల్పోయారు.
దీనికి ప్రధార కారణం ప్రపంచంలో కోవిడ్ 19 విజృంభిస్తూండటం.అయితే, దీనికి ఎస్ బ్యాంక్ పతనం కూడా తోడయింది. దీనిప్రభావం ప్రధానంగా అయిల్ కంపెనీల స్టాక్ ధరల మీద బాగా పడింది. బిఎస్ ఇలో ఒఎన్ జిసి ప్రధాన బాధితురాలయింది. ఈ కంపెనీ షేర్లు 17 శాతం పడిపోయాయి. తర్వాతి దెబ్బ 12.52 శాతం పతనంతో రిలయన్స్ ది. ఇంక బ్యాంకింగ్ సెక్టర్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 12.06 శాతం పతనమయ్యాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధర 30 శాతం పడిపోవడంతో ఒఎన్ జిసి, రిలయన్స్ కుప్పకూలాయి. తమాషా ఏమంటే, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఎస్ బ్యాంక్ తప్ప అన్ని బ్యాంకులు క ష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ ధర 31.58 శాతం పెరిగింది.
టాటా స్టీల్, టిసిఎస్, ఐసిఐసిఐ లు కూడా 6 నుంచి 9 శాతం దాకా పతనమయ్యాయి. చైనా బయట కొరొనా వైరస్ వ్యాపించడంతో క్రూడాయిల్ మార్కెట్ పతనమయింది. ఇక ఎన్ ఎస్ ఇ నిఫ్టీ 50538యపాయింట్ పతనమయి(4.9 శాతం) 10,451 పాయింట్లకు జారిపడింది.
ఎన్ ఎస్ ఇ లో మిడియా, మెటల్ , బ్యాంక్ స్టాక్ లు బాగా దెబ్బతిన్నాయి. వీటిషేర్లు 6.5 శాతం నుంచి 8 శాతం దాకా కుప్పకూలాయి.
ఈ బ్యాక్ గ్రౌండ్ లో విదేశీపెట్టుబడిదారులు తమ డబ్బును ఇండియన్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.
ఫారిన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ శుక్రవారం నాడు రు.3,594.84 కోట్ల షేర్లను అమ్మేసి డబ్బు వెనక్కు తీసుకెళ్లారు.మొత్తంగా గత 15 ట్రేడింగ్ సెషన్స్ లో విదేశీ ఇన్వెస్టర్లు రు.21,937 కోట్లను వెనక్కు తీసుకున్నారు. గత 16 నెలల్లో ఎపుడూ లేనంతగా ఇండియన్ రుపాయి ధర పడిపోయింది. డాలర్ కు 74 రుపాయల దాకా వెళ్లిపోయింది. ఈ వార్త రాస్తున్నపుడు రుపాయి విలువ 31 పైసలు పడిపోయి డాలర్ కు 74.03 పైసలకు చేరింది.