సాగర్ లో మునిగిపోయే పని చేయొద్దు: సోనియాకు జగ్గారెడ్డి లేఖ

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముందు తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక చేయవద్దని, ఉప ఎన్నికయ్యదాకా నియామకం నిలిపివేయాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.
 ఈ మేరకు ఒక లేఖ రాస్తూ ఇపుడు పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేస్తే నాగార్జున సాగర్ లో పార్టీ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరిక చేశారు.
” జానారెడ్డి గారి (నాగార్జున సాగర్ ) నియోజకవర్గానికి సంబందించిన జిల్లా నాయకులుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లు ఆ ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకులు. జానారెడ్డి బలంతో పాటు ఈ ముగ్గురు కూడా కృషి చేస్తే ఆ సీట్ సులువుగా గెలుస్తాం,’ అని ఆయన చెప్పారు.
ఒక వేళ నియామకం ముందుజరిగితే అసంతృప్తి తో ఉన్ననాయకులు ఈ నియోజకవర్గంలో చారంచేయకపోవచ్చనే ఆందోళనను ఆయన పరోక్షం వ్యక్తం చేశారు.
“ఇప్పుడు ఫిబ్రవరి లేదా మార్చి లో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక రానుంది. ఆ సీటు గెలిచిన తర్వాత పీసీసీ ఎంపిక చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ఒక్కసారి దీని పై మేడమ్ సోనియా గాంధీ జి, రాహుల్ గాంధీ జీ ఆలోచన చేయండి. దీంట్లో నాకు ఎలాంటి స్వార్ధం లేదు.కేవలం గ్రౌండ్ రియాలిటీ నే మీ దృష్టికి తీసుకొస్తున్న..తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్న అనుసరిస్తాం,” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
లేఖ పూర్తి పాఠం ఇది:
సోనియా గాంధీ జీ, రాహుల్ గాంధీ జీ గారికి నమస్కారాలు
నేను తూర్పు జయప్రశకాశ్ రెడ్డి ( అలియాస్ జగ్గారెడ్డి ) మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచాను.. మొదటి సారి 2004 సంవత్సరం లో టీఆరెస్ ఎమ్మెల్యే గా గెలిచిన కాంగ్రెస్ తో అలయన్స్ లో భాగంగా గెలిచాను.
2009 సంవత్సరం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచాను…2018 సంవత్సరం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచాను..మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ప్రభుత్వ విప్ గా చేశాను. నేను కూడా పీసీసీ అధ్యక్ష పదవి రేసు లో ఉన్నాను.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో పీసీసీ పదవి పోటీ లో చాలా మంది నాయకులు ఉన్నారు.ఈ పోటీ ,సోషల్ మీడియా లో పార్టీ క్యాడర్ లో,పబ్లిక్ లో డిస్టర్ బెన్స్ అవుతుంది. దీని మీరు ఒక్కసారి గమనించగలరు.
గతంలో మీరు ఎవరిని పీసీసీ గా నిర్ణయిస్తే వారి కిందే మేము అందరం పని చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి సిస్టమ్ ని బ్రేక్ చేసే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ లో మొదలైంది. ఇది కూడా గమనించండి. దీనికి కూడా సోషల్ మీడియా నే ప్రధాన కారణం..ఇది ఎవరు చేసిండ్రో తెలంగాణ నుండి రహస్యంగా రిపోర్ట్ తెప్పించుకుని గమనించగలరు.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి కావాల్సింది పులులు, సింహాలు కాదు. కాంగ్రెస్ పార్టీ కి కావాల్సింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీ కి లాయల్టీ గా ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేయండి..
2023 సంవత్సరం లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. టీఆరెస్ పార్టీ పై వ్యతిరేకత మొదలైంది. బీజేపీ హిందూయిజం తో కొంత ముందుకు వస్తుంది.
కెసిఆర్ డబ్బుకు వోట్లు అలవాటు చేశారు
గతం లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే సంప్రదాయం లేకుండే. కానీ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.
ఇప్పుడు కూడా 50% డబ్బులు ,50% మనం ప్రకటించే పథకాలు మీద గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర డబ్బు ఉందో లేదో తెలియదు… ఎందుకంటే వరుసగా ఎన్నికలు రావడం ఆ ఎన్నికలో పోటీ చేయడం వల్ల నాయకులందరికి ఆర్ధిక ఇబ్బంది ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి గమనించాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం లో ఒక 25 మంది తో ఆర్ధికంగా వనరులు సమకూర్చుకొని పార్టీ బలమైన శక్తిగా పుంజుకొడనికి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని ఆలోచన.
ఇది ఒక ప్రయత్నంగా జరుగాలనేది నా  వ్యక్తిగా అభిప్రాయం. దీంతో పాటు మీడియా రిలేషన్ షిప్ కూడా అవసరం.ఇది కూడా పరిగణంలోకి తీసుకోవాలి.
ఇంక్కోటి కాంగ్రెస్ పార్టీ లో ఆర్ధికంగా బలంగా ఉన్న నాయకులను ఎంపిక చేసి ఒక్కో నాయకుడికి 5 నియోజకవర్గాల చొప్పున గెలిపించే బాధ్యత అప్పగించాలని ఇలాంటి ఆలోచన కూడా చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.
అలాగే తెలంగాణ లో రైతుల సమస్యల పై పోరాటం చేయటానికి ఒక కమిటీ వేస్తే కూడా బాగుంటుందనేది ఒక ఆలోచన..అలాగే నిరుద్యోగుల కోసం ప్రభుత్వంతో పోరాడటానికి ఒక కమిటీ అలాగే మహిళ సంఘాల సమస్యల పై పోరాటం చేయడానికి ఒక కమిటీ, మైనారిటీ,ఎస్సీ, ఎస్టీ ,బీసీ వర్గాల సమస్యల పై పోరాటం చేయటానికి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని ఆలోచన. కాబట్టి ఈ కోణం లో పని చేస్తే రాష్ట్రం లో ప్రభుత్వాని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది..ఇలాంటి సిస్టమ్ ని సమన్వయం చేసే పీసీసీ ని ఎంపిక చేయండి..
ఇప్పుడు ఫిబ్రవరి లేదా మార్చి లో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక రానుంది. ఆ సీట్ మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి గారు గెలిచే సీటు. ఈ సమయంలో పీసీసీ ఎంపిక నిర్ణయం వాయిదా వేసుకుంటే బాగుంటుందనే నా ఆలోచన. ఎందుకంటే జానారెడ్డి గారి నియోజకవర్గానికి సంబందించిన జిల్లా నాయకులుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లు ఆ ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకులు. జానారెడ్డి బలంతో పాటు ఈ ముగ్గురు కూడా కృషి చేస్తే ఆ సీట్ సులువుగా గెలుస్తాం. ఆ సీటు గెలిచిన తర్వాత పీసీసీ ఎంపిక చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ఒక్కసారి దీని పై మేడమ్ సోనియా గాంధీ జి, రాహుల్ గాంధీ జీ ఆలోచన చేయండి. దీంట్లో నాకు ఎలాంటి స్వార్ధం లేదు.కేవలం గ్రౌండ్ రియాలిటీ నే మీ దృష్టికి తీసుకొస్తున్న..తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్న అనుసరిస్తాం.
ప్లీస్ మేడమ్, ఒక్కసారి చెక్ చేయండి. ఇన్ ఛార్జ్ లను , లాబీయిస్టులను కూడా గమనించండి.. ఇందులో నేను ఏమైనా తప్పుగా మాట్లాడిన పరిమితి దాటి మాట్లాడిన క్షమించండి..
మేడమ్, నా రాజకీయ పుట్టక బీజేపీ , మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ బీజేపీ .. బీజేపీ పార్టీ అంటే ఏంటో నాకు తెలుసు..చట్ట సభల్లో నా రంగప్రవేశం టీఆరెస్ లో ఎమ్మెల్యే గా గెలిచే జరిగింది.
కెసిఆర్ ఎంటో నాకు బాగా తెలుసు
కేసీఆర్ ఏంటో కేసీఆర్ కుటుంబం ఏంటో నాకు బాగా తెలుసు.. మా అమ్మ,నాన్న మొదటి నుండి కాంగ్రెస్సే..కానీ వారు ఇద్దరు ఇప్పుడు లేరు చనిపోయారు.. నేను బీజేపీ , టీఆరెస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన కూడా గాంధీ జీ, నెహ్రు జీ, ఇందిరా గాంధీజీ, రాజీవ్ గాంధీ జీ చరిత్ర చదివాను. నేను దూరం నుండి వారు ప్రజల కోసం చేసిన పరిపాలన చూశాను నాకు చాలా నచ్చుతుంది. ఆ తర్వాత మీరు ,రాహుల్ గాంధీ గారు చేసిన పరిపాలన దగ్గర నుండి చూసా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. పదేళ్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న మీరు తీసుకోలేదు. అదే మీ గొప్పతనం. ఇది చరిత్ర లో నిలబడుతుంది. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి గా ఉన్న సమయంలో మీరు భారత దేశం లో ఉన్న అన్ని గ్రామాలు ఆర్ధికంగా నిలబడటానికి ఉపాధి హామీ పధకాన్ని ప్రవేశ పెట్టి దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ఉపాధి కల్పించి ప్రజలను అదుకున్నారు .నాకు మిగితా రాజకీయ పార్టీ ల నుండి ఎన్నో ఆఫర్ లు వచ్చిన కానీ మీకు,మీ ఫామిలీ కి ఉన్న ఎత్తిక్స్ ,సక్రిఫైజింగ్ ఫామిలీ కనుకే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నా.
వివరణ : నేను మీకు ఈ-మెయిల్ ద్వారా ఈ మెసేజ్ పంపివడం జరిగింది .ఇది మీకు అందుతుందో లేదో మీ దృష్టి కి వస్తుందో లేదో అనే అనుమానం తో నేను మీడియా కు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్న. ఇందులో పార్టీ ని డ్యామేజ్ చేసే అంశాలు ఏమీ లేవు..
మరో వివరణ: . నేను మీడియా ముందుకు రావడాన్ని రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ,కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు తప్పుగా భావించొద్దు. నాకు ఇంకొక్క దారి లేదు. నా అభిప్రాయాలు సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ కి చేరడం లేదనేదే అనుమానం. తప్పని పరిస్థితుల్లో మీడియా కి రిలీజ్ చేయాల్సి వస్తుంది.
రాజుల కాలంలో లేఖ మరియు పావురాల ద్వారా వార్తలు పంపించేవారు. ఇది చరిత్ర… నాకు ఇప్పుడు పావురాలు లేవు కాబట్టి నేను పార్టీ శ్రేయస్సు కోసం మీడియా ద్వారా పార్టీ శ్రేయోభిలాషిగా పార్టీ ఇంటిలిజెన్స్ ద్వారా మీడియా కు రిలీజ్ చేయాల్సి వస్తుంది.దయచేసి దీని ఎవరు తప్పుగా భవించొద్దు..
సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ గారికి నా ధన్యవాదాలు ..
ఇట్లు ,
తూర్పు జయప్రకాష్ రెడ్డి ,
(అలియాస్ జగ్గారెడ్డి)
సంగారెడ్డి శాసనసభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *