మంత్రి పదవి తిరస్కరించిన ఏకైక కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్…

సాధారణంగా రాజకీయాల గోల్ మంత్రి పదవే. మంత్రి పదవి ఎంత ముఖ్యమంటే,  మంత్రి పదవీయలేదని నేతలు అలగడం, అసమ్మతి కూడగట్టడం,  అవసరమయితే పార్టీలూ మారుతున్న రోజులివి.
ఇలాంటి రోజుల్లో మంత్రి పదవి వద్దనేవాళ్లుండరు. ఒక వేళ ఉంటే వాళ్లలో మొదటి చెప్పుకోవలసిన పేరు నేడు మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ దే.
2004 నుంచి 2014 దాకా పదేళ్ల పాటు కాంగ్రెస్ నాయకత్వంలో యుపిఎ అధికారంలో ఉన్నపుడు క్యాబినెట్ లో కనిపించని  సీనియర్ నాయకుడాయనే.  క్యాబినెట్ ఆఫర్ ని ఆయన అనేక  మార్లు తిరస్కరించారు.
అహ్మద్ గురించిన కొన్ని అసక్తికరమయిన విషయాలు:
*అహ్మద్ పటేల్  (71) ను బాబు భాయ్  అని ఎపి (AP) అని పిలుస్తారు. తాలూకా పంచాయత్ ప్రెశిడెంట్ గా జీవితం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అత్యంత పలుకుబడి ఉన్న నాయకుడి స్థాయికి ఆయన ఎదిగారు.   కాంగ్రెస్ కు  అక్షరాల ట్రెజరర్ అయనే, రాజకీయ డీలరూ ఆయనే. జబ్బు పడితే హీలరూ ఆయనే.
* 1949 ఆగస్టు 21న జన్మించారు. బారూచ్ లోని జయేంద్రపూరీ అర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బిఎస్సీ చదివారు.   *మొత్తంగా ఎనిమిది సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇందులో మూడుసార్లు లోక్ సభకు బారూచ్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అయిదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
* సోనియా గాంధీ కుటుంబానికి బాగా విధేయుడు. అందుకే  ముగ్గురు నేతలకు ఆయన రాజకీయ కార్యదర్శిగా ఉండేవారు. సోనియా గాంధీకి దాదాపు 16 సంవత్సరాలు సలహాదారుగా ఉన్నారు. అంతకు ముందు రాజీవ్ గాంధీకి,  ఇటీవల రాహుల్ గాంధీకి కూడా ఆయన సలహాదారే.
*కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉంటూ, ఎపుడూ ఇతరపార్టీల వైపు చూడని కొద్ది మంది నాయకుల్లో ఆయనొకరు. ఆయనెపుడూ తెరవెనకే ఉండేవారు. అసమ్మతి అంటే ఏంటో తెలియన సీనియర్ నాయకుడు.
* ఇటీవల రాజ్యసభకు ఆయన గుజరాత్ నుంచి చాలా ఉత్కంఠ భరితమయిన పోటీలో నెగ్గారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆయన రాజ్యసభకు రాకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
* ఆయన మీడియాతో మాట్లాడింది చాలా తక్కువ. మాట్లాడినపుడల్లా కెమెరాలు ఆఫ్ చేయాలయసిందే. ఇది రూల్.
*కష్టకాలాల్లో కాంగ్రెస్ ను, యుపిఎ ప్రభుత్వాన్ని ఆదుకుని నిజమయిన ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్నారు. అమెరికా తో న్యూక్లియార్ డీల్ వ్యతిరేకిస్తూ యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. మన్మోహన్ ప్రభుత్వం కూలిపోతుందనుకున్నారు. కాని విశ్వాసతీర్మానం నెగ్గింది.దీనికి వెనక ఉన్నకృషి మొత్తం అహ్మద్ పటేల్ దే నని చెబుతారు. సమాజ్ వాది పార్టీ మద్దతు కూడగట్టడంలో ఆయన విజయవంతం అయ్యారు.
* కాంగ్రెస్ పార్టీకి ఆయన ట్రెజరర్ గా పని చేశారు. పారిశ్రామిక వేత్తలనుంచి పార్టీకిమద్దుత కూడగట్టేవాడు.  దీనితో ఆర్థిక కష్టాల నుంచి బయటపడేది. పార్టీ బలహాన పడినపుడు ఇతర పార్టీలతో మాట్లాడి ఒప్పించి కాంగ్రెస్ కు బలంచేకూర్చేవాడు.  అదీ ఆయన సామర్థ్యం.
*1985-86లో ప్రధాని రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రెటరీగా పనిచేశారు. అపుడాయన పార్టీ  సిడబ్ల్యూసి సభ్యుడు కూడా. (ఫోటో ట్విట్టర్ నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *