ఆంధ్రలో వెల్ ఫేర్ హాస్టళ్లను మూసేస్తారా? విద్యార్థుల్లో ఆందోళన

జగనన్న వసతి దీవెన పేరుతో  ఈ రోజు ప్రారంభమయిన కార్యక్రమం  సంక్షేమ హాస్టళ్లను ఎత్తివేసేందుకు దారితీస్తుందేమోననే ఆందోళన  ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో మొదలయింది.
 రాయలసీమ యూనైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, రాయలసీమ విద్యార్థి జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాం బాబు, జాతీయ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మోహన్, బిసి విద్యార్థి యువజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి సురేష్ బాబు తదితరులు ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 ఈ రోజు వారంతా కర్నూలు నగరంలోని శశికాంత్ ప్లాజాలోవిలేకరులతో మాట్లాడారు.  సమావేశంలో మాట్లడుతూ హాస్టళ్లను ఎత్తివేసే  కుట్రలో భాగంగానే  రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రథకం ప్రారంభిస్తున్నదని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు.
 జైళ్ళ కన్నా అద్వానంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయని వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల పట్ల నిర్లక్ష్యం చేస్తోందని ఈ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మహానేత డాక్టర్ వైయస్ఆర్ కళాశాల హాస్టళ్లను ప్రవేశపెడితే నేడు జగన్ సర్కారు కేవలం ప్రచారం కోసం జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టి సంక్షేమ హాస్టళ్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని శ్రీనివాసులు ఆరోపించారు.
ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ కార్పొరేషన్ నిధులను 6109 కోట్లను అమ్మబడి పథకానికి మళ్లించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే జగన్ అన్న వసతి దీవెన పథకాన్ని విరమించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆ నిధులు ఉపయోగించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలకానిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బడుగు బలహీనవర్గాల అందరం కలిసి జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి యువజన రాష్ట్ర కార్యదర్శి పిజీ వెంకటేష్, బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు శ్రీను, ఆర్ యు ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు