10రూ.లకే చీర ఆఫర్: సిద్దిపేటలో తొక్కిసలాట (వీడియో)

సిద్దిపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో తొక్కిసలాట జరిగింది. పదిరూపాయలకే చీర ఆఫర్ పెట్టడంతో ఈ చీరలను కొనేందుకు మహిళలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది . ఈ ఘనటలో చాల మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాటలో చాలమంది మహిళలలు తమ ఒంటిపై ఉన్న నగలతో పాటు ఫోన్లు ఇతర విలువైన వస్తువులను పోగొట్టుకున్నారు.

సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద గల సీఎంఆర్ షాపింగ్ మాల్ కస్టమర్ బెనిఫిట్ సేల్ నిర్వహిస్తోంది. అయితే 15,16,17,18 తేదీల్లో 10 రూపాయలకే హ్యాండ్లూమ్ చీర ఆఫర్ ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మాల్ నిర్వాహకులు. తక్కువ ధరకేగా చీరలు లభిస్తున్నాయన్న ప్రచారంతో మహిళలు పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఒకే సారి షాపింగ్ మాల్ గేట్లు ఓపెన్ చేయడంతే మహిళలు ఒకరినొకరు తోసుకున్నారు.

అయితే ఇదే అదునుగా భావించిన కొందరు తమ చేతివాటానికి పని చెప్పారు. మహిళల ఒంటిపై ఉన్న నగలు, ఇతర విలువైన వస్తువులను చోరీచేశారు. ఆఫర్లు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన షాపింగ్ మాల్ నిర్వాహకులు సౌకార్యాలు కల్పించడంలో మాత్రం విఫలం అయ్యారని స్థానికులు ఆరోపించారు. తొక్కిసలాట విషయం తెలుసుకున్న పోలుసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆఫర్ ఉందని వస్తే ఉన్నది పోగొట్టుకున్నామంటు మహిళలు లబోదిబోమన్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *