JBS-MGBS మెట్రో రైల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని ఈ మధ్యాహ్నం  జూబ్లీ  స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మెట్రో రైలులో ఆయన ఎంజిబిఎస్ వరకు ప్రయాణించారు. రెండు స్టేషన్ల మధ్య దూరం 11. కి.మీ. మార్గంలో 9 స్టేషన్లున్నాయి. హైదరాబాద్ మెట్రో వ్యవస్థలో ఇది చివరి దశ. అందువల్ల ఈ కారిడార్ ను ముఖ్యమంత్రితో ప్రారంభింప చేశారు.మెట్రో ప్రాజక్టుల్ ప్రతిపాదించిన 72 కి.మీదూరంలో ఈరోజు  69 కిమీ దూరం నిర్మాణం పూర్తయింది. దీనితో హైదరాబాద్ మెట్రో దేశంలో రెండో పెద్ద మెట్రో వ్యవస్థ అయింది. ఎంజి బిస్ స్టేషన్ మొత్తం మెట్రో లో విశిష్టమయినది. దీని నిర్మాణానికి  58 పిల్లర్లు, 6 గ్రిడ్స్ తో స్టీల్ కాంక్రీట్ తో చాలా పటిష్టంగా నిర్మించారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో అన్నింటికంటే ఎత్తయిన స్టేషన్ కూడా ఎంజిబిఎస్సే. వంద సంవత్సరాల  అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో నిర్మాణం సాగించినట్లు అధికారులు చెబుతున్నారు.