పిఆర్ సి మీద సానుకూలంగా స్పందించిన సిఎం జగన్…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు  ‘AP JAC అమరావతి’ 2021 కాలెండర్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎపి జెఎసి ఛెయిర్మన్  బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ వైవీ రావు  మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతీసుకొని PRC నివేదిక తెప్పించుకొని వెంటనే అమలుచేయాలని కోరారు.

అలాగే ఉద్యోగులకు అంతగా ఉపయోగకరంగా లేని EHS కార్డ్ ల విషయంలో  ముఖ్యమంత్రి  ఉద్యోగసంఘాలతో సమీక్ష జరపాలని బొప్పరాజు కోరినారు. ప్రభుత్వం ఆమోదించిన మెడికల్ ప్రొసీజర్స్ అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ లో EHS పధకం క్రింద అమలు అయ్యేటట్లు చూడాలని, మరీ ముఖ్యంగా కరోనా బారిన పడిన ఉద్యోగస్తులకు వారి కుటుంబసభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్  వైద్య సౌకర్యం అందించాలని, కరోనా కు బయట వైద్యం చేయించుకున్న వారికి రియంబర్స్ మెంట్ సౌకర్యం కలుగచేయాలని బొప్పరాజు  కోరినారు.

AP JAC అమరావతి సిఎం దృష్టికి తెచ్చిన సమస్యలు:

1) టీచర్లతో సమానంగా మహిళా ఉద్యోగినులకు కూడా 5 రోజుల ప్రత్యేక సెలవులు

2) 45 సంవత్సరాలు దాటినా వితంతు/ diverse మహిళలకు కూడా ఫ్యామిలీ పెన్షన్ వర్తింప చేయుట

3) మహిళ ఉద్యోగినలకు ఇచ్చే180 రోజుల ప్రసూతి సెలవులను ప్రొబేషన్ డిక్లరేషన్ కు కలపాలి.

4) హోంగార్డు లకు యూనిఫార్మేడ్ సర్వీస్ శాఖలలో క్లాస్-సి&డి ఉద్యోగాలలో కోటా ఇవ్వాలి.

5) కాంట్రాక్టు ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 58 నుండి 60 సంవత్సరాల కు పెంచాలి.

6) ఇంజినీరింగ్ శాఖలలో పనిచేసే techical ఆఫీసర్స్ కు gazetted హోదా కలిపించాలి.

7) ఇంజినీరింగ్ శాఖలలో పనిచేసే వర్క్ ఛార్జిడ్ ఉద్యోగుల పేరును ఇంజినీరింగ్ సుబార్డినెట్ గా మార్చాలి.

సానుకూలంగా స్పందించిన  ముఖ్యమంత్రి

AP JAC అమరావతి  ప్రస్తావించిన సమస్యల మీద ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు.  జెఎసి  నాయకులతో చర్చించి సాధ్యమైనంత త్వరలో పరిష్కారించాలని అదనపు కార్యదర్శి  ధనుంజయ రెడ్డిని ఆదేశించారు.

AP JAC అమరావతి క్యాలెండర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు, కో ఛైర్మన్స్ జి వి నారాయణరెడ్డి, ఐ. విజయకుమార్,  జి. కేశవనాయుడు, జనకుల శ్రీనివాసరావు  కె సంగీతరావు , మహిళా విభాగం కార్యదర్శి శ్రీమతి మెహరాజ్ సుల్తానాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *