భారత్ లో కోవిడ్ మందు ‘రెమ్డిసివిర్’ వాడేందుకు అనుమతి కోరిన కంపెనీలు

కరోనా మందు రెమ్డిసివిర్ (Remdesivir) భారత్ లో నేరుగా రోగులకు ఇచ్చేందుకు అనుమతినీయాలని రెండు ఇండియాకు చెందిన మందుల కంపెనీలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ప్రపంచంలో కోవిడ్ -19 చికిత్స కు సిద్ధమయిన ఒకే మందు రెమ్డి సివిర్.
దీనిని అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ తయారు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ మందును కరోనా రోగులకు ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదేవిధంగా చాలా దేశాలుకూడా ఈ మందును వాడేందుకు ముందుకు వచ్చాయి.
నేపథ్యంలో రెమ్డిసివిర్ ను ఇండియాలో వాడేందుకు క్లినికల్ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సిప్లా (Cipla), హెటిరో ల్యాబ్స్ (Hetero Labs) కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.
సాధారణంగా కొత్త మందులను భారతదేశంలో చికత్సకు అనుమతించాలంటే వాటి పనితీరు ను మొదట క్లినికల్ ట్రయల్స్ పరీక్షించాల్సి ఉంటుంది.
ఇపుడుదేశంలో కరోనా వ్యాప్తి వల్ల నెలకొన్న అత్యవసర పరిస్తితుల్లో క్లినికల్ ట్రయల్స్ కు మినహాయింపు ఇవ్వాలని ఈ కంపెనీలు డిజిసిఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)ను కోరాయి.
అయితే, ఈ అభ్యర్థనను ఒకనిపుణు కమిటీ పరిశీలించాల్సి ఉంది. ఈ మందును విక్రయించవచ్చా లేదాభారత్ లో కోవిడ్ వ్యాప్తి వల్ల తలెత్తిన అత్యవసరం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్లినికల్ ట్రయల్స్ కు మినహాయింపు ఇవ్వాలా లేక వద్దా అనేవిషయాన్ని కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుంది,’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో ఏదైనా అర్థవంతమయి ప్రయోజనం ఉంటేనే రెమ్డి సివిర్ ను అనుమతించడం జరుగుతుందని డిజిసిఐ విజి సోమాని ఎకనమిక్ టైమ్స్ కు తెలిపారు. ఈ మందును జపాన్ లో విడుదల చేస్తున్నపుడు గిలీడ్ సైన్సెస్ చెప్పిన మినహాయింపులను కూడా భారత దేశం దృష్టిలో పెట్టుకుంటుందని కూడా ఆయన చెప్పారు.
రెమ్డిసివిర్ పూర్తి సురక్షితమయిందని దీనిని తయారుచేసిన కంపెనీయే హామీ ఇవ్వడం లేదు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తే ఈ మందువాడడం వల్ల ఏమయిన దుష్ఫలితాలుంటే బయపడతాయని కంపెనీ ఎపుడో స్పష్టం చేసింది.