వైసిపి అక్రమాల పట్ల ఇంత మౌనమా?: చంద్రబాబు అసంతృప్తి

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పోటీ పడలేక ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటని చెబుతూ  అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ  స్పందించక పోవడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్ఈసీ, పోలీసులపై వుందని ఆయన ఒక ప్రటకనలో పేర్కొన్నారు.
 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రకటన ఇదే:

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

పేదల భూములు వైసీపీ నేతలు కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారు. తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు షాపును అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తున్నాం.

పలాసలో బెదిరింపులకు గురి చేసి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీలో చేర్చుకున్నారు. పోటీ నుండి తప్పుకోకపోతే టీడీపీ అభ్యర్థులపై వైసీపీ విష పంజా విసురుతోంది. జగన్ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చమైంది. జగన్ రెడ్డి ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికృతి చేష్టలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు.

కొర్పొరేటర్ గా టీడీపీ తరపున శ్రీనివాసులు పోటీ చేస్తున్నారనే కక్షతోనే షాపును తొలగించారు. చేతనైతే ప్రజాబలంతో నెగ్గాలి తప్ప బెదిరింపులతో కాదు. శ్రీనివాసులుకు టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అన్ని రికార్డులు ఉన్నా షాపును తొలగించడం కుట్ర కాదా? దీనిపై ఎస్ఈసీ తక్షణమే స్పందించాలి. ఎస్ఈసీ ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడంలేదు. కళ్లెదుటే అన్యాయాలు జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాద్యత ఎస్ఈసీ, పోలీసులపై వుంది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్రంలో రక్షణ లేదు. అధికార పార్టీ బెదిరింపులకు లొంగకపోతే చంపుతున్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుండి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుబట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.

గతంలో ఏనాడైనా ఇలాంటి దుస్థితి ఏర్పడిందా? అక్రమాలు, అరాచకం, విచ్చలవిడి ప్రలోభాలకు తెగబడి వైసీపీ నాయకులు వారి నైజాన్ని నిరూపించుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. దాడులు, బెదిరింపులకు తెగబడితే ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేల్చుతాం.

One thought on “వైసిపి అక్రమాల పట్ల ఇంత మౌనమా?: చంద్రబాబు అసంతృప్తి

  1. రాజకీయ కక్ష సాధింపు చాలా సహజం. అది మీకు తెలియని విషయం కాదు కదా బాబు గారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *