రాజధాని ఎక్కడికీ పోదు : చంద్రబాబు అభయం

అమరావతిని  రక్షించుకునేందుకు రాజధాని ప్రాంతంలో 17 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. ఈ రోజు ఆయన భార్య భువనేశ్వరితో కలసి మందడం వచ్చి రైతులను పరామర్శించి మద్దతు తెలిపి ప్రసంగించారు.
మందడం సభలో‌ జై అమరావతి జైజై అమరావతి అంటూ చంద్రబాబు  ప్రసంగం ప్రారంభించారు.
అమరావతి ని తరలించే శక్తి ఎవరికీ లేదని, అందరం ఐక్యంగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు.
అన్ని విధాలా అనుకూలంమని రాష్ట్రం మధ్య లో ఉందని అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చెబుతూ ఆనాడు అసెంబ్లీ లో జగన్ కూడా అంగీకరించి 30వేల ఎకరాలు అవసరం అన్నారని ఆయన గుర్తు చేశారు.
మాట తప్పను అన్నారు.. మడమ తిప్పను అన్నాడు, తీరా చూస్తే ఏకంగా ఇప్పుడు జగన్ యూటర్న్  తీసుకున్నాడని ఆయన జగన్ ధోరణిని విమర్శించారు.
రైతుల ఆందోళనతో జగన్ భయంపట్టుకుందని రాజధాని ప్రాంతంలొ పరికివాడుగా.. భయంతో తిరుగుతున్నాడని చంద్రబాబు అన్నారు. అమరావతి కోసం ఉద్యమం చేయడానికి‌ ఐదు కోట్ల మంది సిద్దంగా ఉన్నారని చెప్పారు.
‘అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. కేంద్రం అందించిన రు. 1500కోట్లు ఇస్తే అభివృద్ధి పనులు‌ చేశాం. అన్ని‌చోట్ల నుంచి పవిత్ర జలాలు, మట్టి తెచ్చి శక్తివంతమైన పీఠంగా చేశాం.రైతుల కోరిక మేరకు ఆనాడు రిజిస్ట్రేషన్ చేయలేదు. నేను కట్టిన‌ సచివాలయం నుంచే నేడు జగన్ పాలన‌ చేస్తున్నారు. అసెంబ్లీ ని‌ 120 రోజుల్లో నిర్మాణం చేశాం,’ అని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి

అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు బహూకరించిన నారా భువనేశ్వరి

‘జగన్  నన్ను తిడుతున్నాడు… అయినా నాకేమీ‌కాదు. నీ తండ్రి వైయస్ కూడా నాకు గౌరవం ఇచ్చేవాడు. నీకు కనీస సభ్యత, సంస్కారం లేదు.ఆరోజు ముద్దులు పెట్టాడు… నేడు గుద్దులు గుద్దుతున్నాడ,’అని చంద్రబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ ని అమరావతి ప్రాంతంలో అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్  వస్తే అడ్డుకుంటారా…‌ పొలాల్లో నుంచి రావాలాఅని ప్రశ్నించారు.
ఏం జగన్ కాన్వాయ్ కు మరో దారులు లేవా, ముందు డమ్మీ కన్వాయ్ పంపి.. తర్వాత వస్తున్నారని అంటూ ఇంత భయంభయంగా తిరుగుతున్నడని   అన్నారు.
‘ఏడు నెలల్లో జగన్ ఒక్క మంచి పనైనా‌ చేశాడా? 14సంవత్సరాలు సిఎంగా ఉన్న నాతోనే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇక‌ మీరొక లెక్క అనుకుని మూడు రాజధానులు అన్నాడు.అమరావతి ని మార్చే అధికారం మీకెక్కడిది. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా రాజధానులు మార్చారా. మార్పుకి హైకోర్టు అంగీకరించాలి. సుప్రీంకోర్టు, కేంద్రం అంగీకరించాలి. రాజధాని లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి
ఒక‌ సామాజిక వర్గం అని‌ అసత్యాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.’ అని ఆయన విమర్శించారు.
ఇప్పుడు డబ్బులు లేవని కొత్త సాకు చెబుతున్నారని అంటూ డబ్బులు చెట్లుకు కాయవు. సంపదను మనం‌ సృష్టించుకోవాలి, ఇది చేతకాక పోతే రాజీనామా చేయి, అని చంద్రబాబు అన్నారు.