స్కూళ్లు తెరవడం మీద ఏప్రిల్ 14న కేంద్రం నిర్ణయం

దేశవ్యాపితంగా పాఠశాలలను పున: ప్రారంభించే విషయం మీద ఏప్రిల్ 14న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతీసుకోనున్నది. విద్యార్థుల విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఏచర్యలు తీసుకోవాలో కేంద్రం ఆలోచిస్తూ ఉంది. పాఠశాల పున: ప్రారంభంమీద ఇపుడు నిర్ణయం చెప్పడం కష్టమని, అయితే, ఏప్రిల్ 14 వతేదీన దేశ వ్యాపితంగాకరోనా పరిస్థితిని సమీక్సించి నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ ఆదివారంనాడు చెప్పారు.ప్రధాని మంత్రి ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగుస్తున్నసంగతి తెలిసిందే.
భారతదేశంలో 34 కోట్ల మంది విద్యార్థులున్నారు. ఇది అమెరికా జనాభా కంటే ఎక్కువ.వాళ్లుదేశపు విలువయిన సంపద. విద్యార్థుల, ఉపాద్యాయుల భద్రత అనేది ప్రభుత్వానికి చాలా కీలకమయి అంశమని ఆయన చెప్పినట్లు డెక్కన్ హెరాల్డ్ లో ఒక వార్త అచ్చయింది.
దేశంలో 800 విశ్వవిద్యాలయాలు, 40వేల కాలేజీలు,12వేల ఉన్నత విద్యాసంస్థలతో పాటు 1.5 లక్షల పాఠశాలలున్నాయి.
కేంద్రం నుంచి అందుతున్న సూచనల ప్రకారం, మార్చి 24 నుంచి అమలులో ఉన్న ఏప్రిల్ పద్నాలుగు తర్వాత లాక్ డౌన్ కొనసాగక పోవచ్చు.