Home Breaking నాలుగో సారి లాక్ డౌన్ పొడిగింపు: ప్రధాని మోదీ

నాలుగో సారి లాక్ డౌన్ పొడిగింపు: ప్రధాని మోదీ

327
0
దేశవ్యాపితంగా కరోనా లాక్ డౌన్ ను నాలుగోసారి పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ రోజు రాత్రి దశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ నాలుగో సారి (4.0) లాక్ డౌన్ గురించి చెప్పారు.
ఈ లాక్ డౌన్ కొత్త రూపంలో కొత్త నియమాలతో ఉంటుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన సలహాలు ఆధారంగా ఈ నాలుగో లాక్ డౌన్ ను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు మే18న లోపు వెల్లడిస్తామని ఆయన అన్నారు.
కరోనా వైరస్ మనజీవితంలో ఒక భాగం అవుతూఉంది. అయితే, దాని చుట్టూర మనం తిరిగే పరిస్థితి రానీయమని ప్రధాని చెప్పారు.
ఇపుడు అమలులో ఉన్న మూడో లాక్ డౌన్ మే 17 ను ముగుస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్  ప్రపంచం మొత్తాన్నీ సమస్యల్లోకి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు కూడా అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
కరోనాతో పోరాడేందుకు ఆత్మ నిర్భర్ భారత అభియాన్  పేరుతో  రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని  ప్రధాని మోడీ ప్రకటించారు. ఇది జిడిపిలో పదిశాతం. లాక్ డౌన్ కారణంగా వలస  కూలీలతో పాటు వివిధ ఆర్థిక రంగా లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిధులు వాడతారు.  ఈ ప్యాకేజీ వివరాలను రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని ఆయనప్రధానవెల్లడించారు.
ప్రత్యేక పాకేజీలో రైతులు, కార్మికులు, వలస కూలీలు, చిన్నతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలతోపాటు  నిజాయితీగా పన్నులు చె్ల్లించేవారికి తోడ్పాటు ఉందని ఆయన చెప్పారు.

ప్రధాని ప్రసంగం విశేషాలు:
కరోనావైరస్‌పై ప్రపంచ పోరాటం నాలుగు నెలలుగా సాగుతోంది.
ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవితాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యావత్తు ప్రపంచం ఒక రకమైన యుద్ధం చేస్తోంది.
ఇదివరకు ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు.వినలేదు.మానవ జాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతమిది.కానీ, అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరు.
మనల్ని మనం కాపాడుకోవాలి. ముందుకు సాగాలి. మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది. 21వ శతాబ్దం భారతదేనని మనం గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం.
దేశం రక్షింపబడాలి, అలాగే అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి.ఒక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా మహామ్మారి మానవ జాతికి సంక్షోభ సమయం. కరోనాతో యుద్ధం చేద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం.
4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నాం. ఈ కరోనా ఓ సందేశం తీసుకు వచ్చింది. కరోనాకు ముందు PPE, N95 భారతదేశంలో అత్యల్ప ఉత్పాదన, నేడు రోజుకు 2లక్షల PPEలు అలాగే N95 2లక్షలు తయారవుతున్నాయి.
 మానవాళికి కరోనా వైరస్ నిర్మూలన ఓ పెద్ద ఛాలెంజ్, వసుదైక కుటుంబం కలిసి ఐక్యంగా పోరాడాలి.  కరోనాలో మనిషి పోరాడి గెలుస్తాడు, ఓడే ప్రసక్తే లేదు. ప్రపంచంలో కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.కరోనా విపత్తును అవకాశంగా భారత్ మలుచుకుంది.యావత్ ప్రపంచానికి భారత్ మార్గదర్శకంగా నిలిచింది.
 కరోనా సంక్షోభం కంటే మన సంకల్పం బలమైంది గొప్పది. జీవన్మరణ సమయంలో భారతదేశ ఔషధాలు ఆయుధాలుగా ఉపయోగబడ్డాయి.
 మన దేశంలో విలువైన యువత, ట్యాలెంట్ ఉంది. మంచి ఉత్పత్తులు తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము.ప్రపంచానికి యోగాను భారత్ కానుకగా ఇచ్చింది.
మన దేశ సామార్ధాన్ని ప్రపంచం గుర్తించింది.2000సంవత్సరంలో Y2K సమస్యను పరిష్కరించిన ఘనత మనదే. భారత్ అభివృద్ధి పయనం మొదలయింది. మన ఆర్థిక వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనదేశ సిస్టమ్, డేమోగ్రఫీ మన బలం, మన దేశంలోని డిమాండ్ అంశాలపై ఆధారపడి ఉంది.
ఆత్మ నిర్బర్ భారత్ మన లక్ష్యం. 20 లక్షల కోట్లు ప్యాకేజీ 2020లో కేటాయిస్తున్నాము.స్వయం సమృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలో భారతీయ ఔషధాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్నాయి.
21వ శతాబ్దం మనదే. ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యం