తిరుమల దర్శనం అనంతరం ఎన్నికల ప్రచార భేరిలో చంద్రబాబు

ఏపీ ఆపద్ధర్మ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ, కెసిఆర్, జగన్ లను దుయ్యబట్టారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో పూర్తిగా కింద ఉంది చదవండి.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదు. రాష్ట్ర సమస్యలపై 29 సార్లు ఢిల్లీ వెళ్లి పదే పదే చెప్పినా వినలేదు. వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన మోడీ ఏపీకి ద్రోహం చేశారన్నారు. నమ్మకద్రోహం చేశారనే బీజేపీపై తిరుగుబాటు చేశాము. 18 హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు. రాష్ట్రం కోసం తిరుగుబాటు చేస్తే మనపైనే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన రూ.5వేల కోట్లు ఇవ్వమంటే మనపైనే ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు.

గెలుపు గుర్రాలను రంగంలోకి దింపామని అన్నారు. టీడీపీ తొలి జాబితా పట్ల 90శాతం మంది కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ఆలోచనతో ఉండాలి. అభ్యర్థుల ఎంపిక చాలా పకడ్బందీగా చేస్తున్నాం. కార్యకర్తలు నాకు ప్రాణ సమానమని, నా కుటుంబ సభ్యుల కన్నా మిన్న అని తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి వెల్లడించారు.

కార్యకర్తల త్యాగాల ఫలితంగానే అధికారంలోకి వచ్చాము. ప్రపంచ స్థాయిలో నాకు గుర్తింపు రావడానికి కార్యకర్తలే కారణం. పార్టీ జెండా మోసిన కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో వైసీపీకి ఓటేస్తే అవినీతి పార్టీకి ఓటేసినట్టవుతుందని మోడీ అన్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *