రాజధాని వికేంద్రీకరణ జివొను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్  పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి డి.రామారావు, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
AP Decentralization andiInclusive development of regions Bill-2020)  , సీఆర్డీఏ-2014 (AP Capital regions development authority Bill-2020) బిల్లులకు గవర్నర్ ఆమోదంతెలిపాక రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల మీద గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ గెజిట్ ప్రకటనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటి అమలుపై స్టే ఇవ్వాలని రామారావు అభ్యర్థించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి తదితరులను పిటిషన్ లో  ప్రతివాదులుగా పేర్కొన్నారు.
అయితే రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం హైకోర్టుకు సెలవు కావడంతో మంగళవారం ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించనున్నట్లు ఆయన తెలిపారు.