రమామణి మృతికి జగన్ ప్రభుత్వ వేధింపులే కారణం: ఆనంద్ సూర్య

(ఆనంద్ సూర్య)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలకు ఐఏఎస్ , ఐపీఎస్ ఆఫీసర్లు  బలవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే సీనియర్ ఐఏఎస్ అధికారిణి రమామణి మృతి చెందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది.
ఉన్నతాధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తోంది. కుల ప్రాతిపదికన విభజించి పాలన సాగిస్తోంది.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఎందరో యువ ఐఏఎస్ లకు రమామణి ప్రేరణగా నిలిచారు.
గత తెలుగుదేశం హయాంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా కియా భూముల సేకరణలో కీలకంగా వ్యవహరించారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ కు కార్యదర్శిగా పనిచేస్తున్న రమామణిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే ఆ బాధ్యత నుంచి తప్పించింది. పోస్టింగ్ ఇవ్వకుండా వేధించింది. ఆమె మృతికి పరోక్ష కారణమైంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల్లో అఖిల భారత సర్వీసు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నాటి వైఎస్ ప్రభుత్వంలో ఒత్తిళ్లకు తలొగ్గిన ఐఏఎస్ లు నేటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 100 మందికి పైగా పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు కోర్టుల ముందు ఐఏఎస్ లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సాక్షాత్తూ డీజీపీ, చీఫ్ సెక్రటరీ కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబట్టారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి. నియంత పోకడలను విడనాడాలి. కక్షపూరిత విధానాలకు స్వస్థి చెప్పి సమర్థతకు పెద్ద పీట వేయాలి. ప్రజా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఐఏఎస్ అధికారుల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి.
(ఆనంద్ సూర్య, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్)