కేంద్రం డబ్బు తీసుకుని ప్రధాని బొమ్మతీసేస్తివి, ఇదేం పని జగనన్న: బిజెపి

ప్రధాన మంత్రి  కిసాన్ యోజన  మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలలోనుంచి  ప్రధాని బొమ్మ  తీసేయడం పట్ల ఆంధప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభ్యంతరం చెప్పింది. ప్రధాని చిత్రం ముద్రించకుండా పత్రికా ప్రకటనలు జారీ చేసి వైసిపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీనినికించపరచడం పట్ల  జాతీయ లేబర్ బోర్డ్ చైర్మన్ , భాజపా రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ నారాయణ వల్లూరు విచారం వ్యక్తం చేశారు. వ్యా ఇది సరైన విధానం కాదని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇపుడు విడుదల చేస్తున్న రు. 13500 రహస్యం ఆయన వెల్ల డించారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నపుడు  రైతులకు 12000 వేలు చెల్లిస్తామని జగన్  హామీ ఇచ్చిన విషయం గుర్తుచేస్తూ,  కేంద్రం ఇపుడు ప్రభుత్వం ఇస్తున్న 6000 తో కలిపి 12 వేలు తానే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి  జగన్  బిల్డప్ ఇచ్చుకోవడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.
తన రు.12వేలకు మరొక  1500 పెంచి మొత్తం 13,500 రూపాయలుగా చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే దీనిని భరిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని జయప్రకాష్ నారాయణ అన్నారు.
కేంద్రలో మోడీగారి ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు పంట పెట్టుబడి సాయం క్రింద సంవత్సరానికి రూ 6000 మూడు విడతలుగా ఇస్తామని చెప్పిందని దానికి అనుగుణంగా నే కేంద్రం ఆయా స్థానిక ప్రభుత్వాల ద్వారా చేరవేసే బాధ్యత ప్రభుత్వానిదే నని స్పష్టంచేశారు.
కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలకు అదనంగా జగన్ పాదయాత్ర లో హామీ,నవరత్నాలు లో ముఖ్యమైన ఈ రైతు భరోసా కు ఇస్తన్నన్న12,500/ కలిపి 18500/- ప్రతీ రైతు ఖాతాకు ఇవ్వాలి అని జయప్రకాష్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమ ప్రచార ప్రకటనల్లో ప్రధాని బొమ్మను కూడా తీసేయటం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే.
పీఎం కిసాన్ – రైతు భరోసా పథకంలో కేంద్రం వాటా 45% పైగా ఉన్నదన్న సంగతి ముఖ్యమంత్రి గమనించాలి అని హితవు పలికారు.
రైతు భరోసా – పి ఎం కిసాన్ పథకంను సొంత పథకం క్రింద ప్రచారం చెసుకొంటున్న మరొక.స్టిక్కర్ సి ఎం. జగన్.
వైసిపి ప్రభుత్వం నేడు విడుదల చేసిన పీఎం కిసాన్ ప్రకటన లో ప్రధాని బొమ్మను ముద్రించకుండా పత్రికా ప్రకటనలు జారీ చేసి అవమానించారని జాతీయ లేబర్ బోర్డ్ చైర్మన్ , భాజపా రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ నారాయణ వల్లూరు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో రైతులకు 12000 వేలు చెల్లిస్తామని హామీఇచి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6000 తో కలిపి 12 వేలు తానే ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తే గతంలో ఖండించగా రాష్ట్రం నుండి 1500 పెంచి మొత్తం 13,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని జయప్రకాష్ నారాయణ వాపోయారు.