బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గుస్సా…

ఊరూర్లో రామాలయాలున్నపుడు మరొక రామాలయం ఎందుకు? రామాలయం పేరుతో ఇపుడు బిజెపి నేతలు చందా వసూళ్లకు దిగారని, చందాలివ్వవద్దని కోర్టు టిఆర్ ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్లవిద్యాసాగర్ ఇచ్చిన పిలుపుకు గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ జవాబు…

అయోధ్యరామాలయానికి చందాలివ్వవద్దని పిలుపు నీయడం సిగ్గుచేటు. ఇలా పిలుపు ఇచినందుకు విద్యాసాగరరావు క్షమాపణలు  చేయాలి. ఒక వైపు ముఖ్యమంత్రి కెసిఆర్ తాను అందరికంటే ఎక్కువ హిందువునని ప్రకటన చేస్తుంటే  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  రామమందరం గురించి అవాంఛనీయ ప్రకటనలుచేయడం విచారకరం. అయోధ్య రామాలయం నిర్మాణ  చందా కోసం భారతీయ జనతా పార్టీ ఎవరిమీద ఒత్తిడి తీసుకురావడంలేదు.

‘అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతి హిందువు కల. రామ మందిరాన్ని కట్టేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. అయితే,  ప్రతి హిందువునుఆలయ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని, ఒక నిధి ఏర్పాటుచేశారు. బొట్టు పెడితేనే హిందువా? బీజేపీ వాళ్ళు చందా వసూలు చేస్తున్నారు.ఊరూర రామాలయాలున్నాయి, మరొక రామాలయం ఎందుకు? ఒక్క రూపాయి ఇవ్వవద్దు అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పడం సిగ్గు చేటు. విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలి,’ అని రాజాసింగ్ అన్నారు.

టిఆర్ ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఏమన్నారంటే…

కోరుట్ల  టిఆర్ ఎస్  ఎమ్మెల్యే కల్వ కుంట్ల వ విద్యాసాగర్ బిజెపి చేస్తున్న  రాామాలయం హడావిడికి ఖండించారు.

తెలంగాణలో తమకు వూరూరున రామాయాలయాలున్నాయని, తమకు ఉత్తర ప్రదేశ్ లోని రామాలయం అవసరం లేదని ఆయన జగిత్యాలలో  అన్నారు.

ఉత్తర ప్రదేశ్ అయోద్యరామాయలం పేరు చెప్పి భారతీయజనతా పార్టీ నేతలు చందాలవసూళ్లకు దిగడం మీద ఆయన అభ్యంతరం చెప్పారు. బిజెపినేతలకు చందాలీయవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

విద్యాసాగర్ ఇంకా ఏమన్నారంటే…

మేమందరం శ్రీరాముని భక్తులమే. బొట్టు పెట్టుకుంటేనే రాముడి భక్తులం అవుతామా?

బీజేపీ నాయకులు అయోధ్యలో రామ మందిరం కోసం చందాలంటూ వసూలుకు పూనుకున్నారు.

ఉత్తర్ప్రదేశ్ లో ఉన్న ఆ రాముడు మనకెందుకు? మన గ్రామాల్లో మనకు రాముడు ఉన్నడు.

అయ్యోధ్య రామాలయనికి చందాలు ఎవరు కూడా ఇవ్వొద్దు.

ఇప్పుడు కొత్తగా బీజేపీ నేతలు రామమందిరం పేరుపై బిచ్చమెత్తుకుంటుర్రు.

ఎవరి గ్రామాల్లో వారికి రామాలయలు ఉంటే,  బీజేపీ నేతలంతా  మరొక రామమందిరంపై కొత్త నాటకం ఆడుతున్నారు.

రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ  కొత్త రాజకీయ డ్రామా ఆడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *