ముఖ్య అతిధిగా వెళ్లి, రక్త దానం చేసిన ఎంపి కోమటి రెడ్డి

కాంగ్రెస్ నాయకుడు,  భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ రోజు రక్త దానం చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని తుర్కయాంజల్ మున్సిపాలిటీలో కొత్తకూర్మ శివకుమార్ మంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి తో కలిసి  హాజరయ్యారు. అయితే ఆయనను శిబిరం ఉత్సాహపరిచింది. వెంటనే రక్తదానానికి పూనుకున్నారు. సాధారణంగా ముఖ్య అతిధులుగా వచ్చిన వారు రిబ్బన్లు కత్తిరించిపోతుంటారు. కాని కోమటి రెడ్డి ఒకడుగు ముందుకే ముందు తనే రక్తం ఇచ్చారు.
అనంతరం మాట్లాడుతూ రక్తదాన ప్రయోనం గురించి వివరించారు.
‘రక్తం ఇవ్వటానికి చాలామంది భయపడతారు. కానీ రక్తం ఇవ్వటం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వటం మూలంగా మన శరీరంలో కోతరక్తం వస్తుంది. దానితో మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం చేసే రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాం,’ అని కోమటిరెడ్డి అన్నారు.
అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పదని, కరోన సమయంలో ఆలస్యం అయినా మంచి కార్యక్రమం తీసుకున్నారని ఆయన నిర్వాహకులను అభినందించారు.
‘ రక్తం లేక చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. రక్తం ఇవ్వటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్లం అవుతాం, మన శరీరంలో రక్తం చిక్కగా కావటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గి గుండె పోటు వస్తుంది. కనీసం 6 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వటం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ పెరిగి మనం ఆరోగ్యంగా ఉంటాము. తుర్కయాంజల్ మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శంగా నిలవాలి,’ అని అన్నారు.