తెలంగాణ టెన్త్ పరీక్షలు వాయిదా వేయండి: బాలల హక్కుల సంఘం

జి హెచ్ ఎంసి, రంగారెడ్డి, సికిందరాబాద్ ప్రాంతాలలో మినహా మిగతా ప్రాంతాల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించ వచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చినందున,ఎదురయ్యే  సమస్యలను దృష్టిలో పెట్టకుని టెన్త్ పరీక్షలను వాయిదావేయడమే మార్గమని బాలల హక్కుల సంఘం అభిప్రాయపడింది.
కోర్టు తీర్పు  నేపథ్యంలో టెన్త్ పరీక్షలను రెగ్యులర్ గా, సప్లిమెంటరీలుగా రెండు సార్లు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో గందరగోళం నెలకొంటుంది. కొవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇలాంటి తీర్పుఇచ్చింది.

https://trendingtelugunews.com/telugu/breaking/high-court-asks-ts-against-conducting-tenth-exams-in-ghmc-rangareddy-and-secuderabad/

‘గత కొద్ది రోజులుగా  జిల్లాలలో సహితం కరోనా కేసులు విస్తరిస్తున్నవిషయాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తించాలి.  కరోనా కేసులు పెరుగుతున్నందున పరీక్షలు నిర్వహించాలనే పట్టుదల కి పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ఒకే సారి నిర్వహించేలా చర్యలు చేపట్టాలి, దీనికోసం పాక్షికంగా పరీక్షలు నిర్వహించకుండా  వాయిదా వేసి కరోనా ప్రభావం మొత్తం తగ్గిన తర్వాత పదవతరగతి పరిక్షలు నిర్వహించడం సబుబు,’ అని బాలల హక్కుల సంఘం పేర్కొంది.
హైకోర్టు తీర్పు, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను కరోనా పరిస్థితి మెరుగుపడేదాకా వాయిదా వేయాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.