విప్లవ కవి వరవరరావుకు కండిషన్ బెయిలు మంజూరు

వరవర రావు (81) కు బెయిల్ మంజూరు అయింది. కోరెగావ్-భీమా కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావుకు ఈ రోజు బాంబే హైకోర్టు ఆయన ఆరోగ్యం క్షిణిస్తున్నందున షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్  వరవరరావు భార్య పెండ్యాల హెమలత, ఇతరు హక్కుల ఉద్యమకారులు వేసిన బెయిల్ పిటిషన్ లను విచారించి ఎస్ ఎస్ షిండే, జస్టిష్  మనీష్ పితాలే ల ధర్మాసనం ఈ  ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ మనీఫ్ పితాలే ( credit: barandbench)

ఆయన ఆరోగ్యం క్షిణిస్తున్న విషయాన్ని ఆయన తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టి కి తీసుకువచ్చారు.  గత ఏడాది కాలంలో ఆనారరోగ్యం కారణంగా 149 రోజులు ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని ఆమె కోర్టు ముందుంచారు. ఆయన మహారాష్ట్ర తలోజా జైలులో అండర్ ట్రయల్ గా ఉంటున్నారు. అయితే, ఆరోగ్య కారణాల వల్ల ఆయన జైలు నుంచి విడుదల చేసి కుటుంబంతో ఉండేందుకు అనుమతించాల్సిన అవసరం ఉందని ఆమె వాదిస్తూ వస్తున్నారు.

ఇపుడాయన ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నానావతి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూండటం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు దేశంలో ఏందరో మేధావులు ఆందోళనవ్యక్తం చేస్తూ వస్తున్నారు.

దీనితో  చికిత్సకోసం  ఆరునెలల పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే, విచారణ కు ఎపుడూ అందుబాటులో ఉండాలని ఆయన ను ఆదేశిచింది.

“We are of the opinion that this is a genuine and fit case to grant relief or else will be abdicating our constitutional duties as protector of human rights and right to health covered under the right to life of Article 21 of the Constitution,”అని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ముద్దాయి, బెయిల్ ను దుర్వినియోగం చేయకుండా గౌరవించేందుకు షరతులను విధిస్తున్నట్లు జస్టిస్ షిండే చెప్పారు.

వరవరరావు కేసు మీద వాాదించేటపుడు మానవతాదృక్పథం ప్రదర్శించాలని జస్టిస్ షిండే ఎన్ఐఎ న్యాయవాదులకు సలహా ఇచ్చారు.

 


You make sure to keep in mind the age and health of Dr Rao, He is above 80 years old. Ensure your submission take this into account: Justice SS Shinde


వరవరరావు  బెయిల్ మీద ఉన్న ముంబై NIA కోర్టు పరిధిలోనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆయన తన సమీపంలోని పోలీస్ స్టేషన్ వాట్సాప్  వీడియో కాల్  ద్వారా హాజరు రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు, బెయిల్ మీద ఉన్నపుడు మీడియా మాట్లాడరాదని కూడా కోర్టు పేర్కొంది.

“ We feel that although the material on record does show that the health condition is precarious we feel that that sending him back to where he belongs is fraught with the risk of his presence being used by those allegedly associated with him,”

ఇవి కూడ చదవండి

*వరవరరావు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యుల ఆందోళన

*వరవరరావు విడుదల కోసం ఉపరాష్ట్రపతికి ఎమ్మెల్యే భూమన లేఖ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *