బాబ్రి మసీదు కూల్చివేత కేసు కోట్టేయడం…ఇది బ్లాక్ డే: ఒవైసీ

హైద‌రాబాద్‌: బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో సీనియ‌ర్ నేత అద్వానీ స‌హా 32 మందికి ఇవాళ ల‌క్నోలోని సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ  రోజు సిబిఐ స్పెషల్ కోర్టు బాబ్రి మసీదు కూల్చివేత కుట్ర కేసు మీద ఇచ్చిన తీర్పు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు.
భార‌తీయ న్యాయ చ‌రిత్ర‌లో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుంది అ‌న్నారు.
బాబ్రీ కూల్చివేత‌లో కుట్ర లేద‌ని కోర్టు చెబుతోంద‌ని,  ఈ ఘ‌ట‌న అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగింద‌ని తేల్చేందుకు ఎన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.
సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణ‌యం భార‌తీయ న్యాయ చరిత్ర‌లో బ్లాక్ డే అన్నారు.
ఇప్ప‌టి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింద‌ని, చ‌ట్టాల‌ను అతిక్ర‌మించార‌ని, ప్ర‌ణాళిక ప్ర‌కారమే ప్రార్థ‌నా మందిరాన్ని ధ్వంసం చేశార‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం చెప్పిన‌ట్లు అస‌దుద్దీన్ తెలిపారు.
బాబ్రీ మ‌సీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించిన‌ద‌ని, మ‌సీదు కూల్చివేత‌కు కార‌ణ‌మైన వాళ్ల‌ను దోషులుగా తేల్చాల్సి ఉండెన‌ని, కానీ వారికి రాజ‌కీయంగా ల‌బ్ధి జ‌రిగిన‌ట్లు ఓవైసీ ఆరోపించారు.
బాబ్రీ మ‌సీదు కూల్చివేత అంశంతోనే బీజేపీ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు.