ESI స్కాంలో అచ్చన్నాయుడు A2: ఎసిబి జాయింట్ డైరెక్టర్

ఈ ఏస్ ఐ స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు రెండు ఎఫ్ ఐ ఆర్ లను నమోదచేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) జాయింట్ డైరరెక్టర్  రవికుమార్ విజయవాడలో  వెల్లడించారు.
కొనుగోళ్ళకు సంబంధించి ఒకటి, టెలీ మెడిసిన్ కి సంబంధించి విడి విడిగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని, ఇందులో మాజీ మంత్రి అచ్యన్నాయుడు A2 అని, సికె రవికుమార్  A1 అని ఆయన చెప్పారు.
వీరిద్దరికి నిన్న ఎసిబి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, అచ్చన్నాయుడిరి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయన పరిశీలించారు.ఆపరేషన్ గాయం ప్రయాణం వల్ల కొద్ది గా పుండుగా మారిందని డాక్టర్ చెప్పారు.
ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జేడీ జనార్దన్, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
ESI నిధుల కేటాయింపులో 2018-19కి సంబంధించి 988 కోట్లలో 150 కోట్లు అవినీతి గుర్తించాం. ల్యాబ్ కిట్ల కొనుగోలు, సర్జికల్, ఆఫీస్ ఫర్నిచర్, ఈసీజీ కొనుగోలు లో ఈ అక్రమాలు జరిగినట్టు  గుర్తించాం.ఈ కేసులో ఇప్పటి వరకు19 మంది ముద్దాయిలను గుర్తించాం. మరింత మందిని విచారణ చేయబోతున్నాం. డాక్యుమెంట్స్ పరిశీలన చేయాల్సి ఉంది. అచ్చెన్నాయుడు కి వైద్యం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.  డాక్టర్ల బృందం అచ్చెన్నాయుడు కి వైద్యం చేసింది. టెలీ హెల్త్ లో ఈసీజీ కి 200 రూపాయలు బదులు 480 వసూలు చేశారు .కాల్ సెంటర్ సర్వీసులు వాడుకున్న వారికి 1.80 బదులు ఎక్కువగా వసూలు చేశారు
అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ తరపున హౌస్ మోషన్ పిటిషన్లు వేశారు. వేరే రాజకీయ నాయకుల పాత్ర ఇంత వరకు గుర్తించలేదు. ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాం. అవసరం లేకపోయినా, నాణ్యత లేని పరికరాలు మందులు కొన్నారని గుర్తించాం. అచ్చెన్నాయుడు లెటర్ ద్వారా అర్దర్లు ఇవ్వాలని ఆదేశించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడ్ని విచారణకు రావాలని కోరలేదు. ఆధారాలు సేకరించాం, అవకతవకలు చేసినట్టు గుర్తించాం కాబట్టే అరెస్ట్ చేసాం.