‘ఫైటర్ అచ్చన్న’ టిడిపి-ఎపి అధ్యక్షుడవుతున్నారా?

అసెంబ్లీలోపుల బయట వైసిపిని బాగా ఇబంది పెట్టిన శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి కింజారపు అచ్చన్నాయుడు తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షువుతారనే ప్రచారం జరుగుతూ ఉంది.  ప్రస్తుతం అధ్యక్షుడు కళా వెంకట్రావ్ 2015 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అందువల్ల ఆయన స్థానంలోకి అచ్చన్నాయుడిని తీసుకుంటారని చెబుతున్నారు.
అచ్చన్నాయుడు కోర్టు ఉత్తర్వులతో పోలీసు కస్టడీ నుంచి విడుదలయ్యారు. ఆయనను ఇఎస్ ఐ కుంభకోణంలో కేసులో అనుమానితుడని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆనారోగ్యంతో చికిత్సపొందుతూ ఉన్నపుడు ఆయనకు కోవిడ్ సోకింది.ఆయనను విడుదలచేయాలని టిడిపి డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో విడుదల చేయక తప్పలేదు.
అరడుగల పైగా ఎత్తున్న అచ్చన్నాయుడి మాట కూడా చాలా గట్టిగా ఉంటుంది. సభలో ఎంత గొడవ లో ఆయన గొంత స్పష్టంగా వినబడుతుంది.  ప్రతిపక్షంలో ఉన్నపుడు స్పీకర్ మైక్ కట్ చేసినా అచ్చన్నాయుడు మాట్లాడితే సభ మారుమోగేది. అంతేకాకుండా అచ్చన్నాయుడి దాడి కూడా పదునుగా ఉండేది. మాట పదునే,అంశమూ పదునే. అందుకే రూలింగ్ పార్టీకి ఆయన టార్గెడ్ అయ్యాడని చెబుతారు.
అధికారంలో ఉన్నపుడు , మంత్రిగా ఉంటూ ప్రతిపక్షం దాడల నుంచి అచ్చన్నాయుడు టిడిపిని ఆదుకోవడం లో ఎపుడూ ముందండేవాడు ఆరోజుల్లో ప్రతిపక్షనాయకుుడ జగన్ కు సాధ్యమయినంతవరకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండాచూసే వారు. ఆయన మాట్లాడితే గట్టి కౌంటర్ ఇచ్చిన టిడిపి ‘ప్రంట్ లైన్ వారియర్స’ లో మొదట చెప్పుకోవలసి పేరు అచ్చన్నాయుడిదే.
ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ప్రభుత్వం అవకతవకలంటూ, కుంభకోణాలంటూ, వైఫల్యాలంటూ సభ దద్దరిల్లేలా మాట్లాడి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది అచ్చన్నాయుడే.
అందుకే చంద్రబాబు తర్వాత అచ్చన్నాయుడే వైసిపికి ప్రధాన శత్రువయ్యాడని టిడిపి నాయకులు చెబుతారు. ఆయన నోరుమూయించేందుకు, శ్రీకాకళం ప్రాంతంలో ఆయన కుటుంబ ప్రాబల్యం తగ్గించేందుకు వైసిపి అచ్చన్నాయుడిని ఇఎస్ ఐ స్కాంలో  ఇరికించిందనేది టిడిపి వాదన.
కోర్టు కేసులతో, ప్రభుత్వం వేధింపులతో ఉన్న అచ్చన్నాయుడికి, ఆయన అభిమానలకు, కుటుంబ సభ్యులకు నైతిక బలం ఇచ్చేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చన్నామయుడిని ఆంధ్రాయూనిట్ అధ్యక్షుడిని చేయబోతున్నట్లు సమాచారం.
ఇప్పటి అధ్యక్షుడు కిిమిడి  కళావెంకట్రావ్ 
ఇపుడు మాజీ మంత్రి కమిడి కళా వెంకట్రావ్  2016 అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక అధ్యక్షుడిని నియమించాల్సి వచ్చింది.అపుడు వెనకబడి వర్గానికి ఉత్తరాంధ్రకు చెందిన కళావెంకట్రావ్ ను అధ్యక్షుడిగా నియమించారు. కళా వెంకట్రావు తొలినుంచి పార్టీలోఉన్ననాయకుడ. మధ్యలో కొద్ద రోజులు ఆయన ప్రజారాజ్యం పార్టీలోచేరినా మళ్లీ తిరిగొచ్చారు. ఆయన వారసుడిగా కూడా అదే జిల్లాకు చెందిన బిసి వర్గానికే చెందిన అచ్చన్నను ఎంపికచేయాలనుకోవడం విశేషం.