గుంటూరు ఆసుపత్రిలో అచ్చన్నాయుడు

ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ ప్రకటించారు. రెండు రోజుల కిందట ఆయన కు ఆపరేషన్ జరిగింది. ఈ గాయం గురించి చెబుతూ రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని ఆయనను చెప్పారు. ఎసిబి కోర్టు ఆయకు రెండు వారాల రిమాండ్ ఆదేశించినా, ఆరోగ్యం సరిగ్గాలేనందున ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
“ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగింది. ఇన్‌ఫెక్షన్‌ పెద్దదైతే మరోసారి ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. 90శాతం మేరకు మళ్లీ ఆపరేషన్‌ అవసరం లేదు. అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదు.నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు పడుతుంది.పూర్తిగా కోలుకోడానికి కొన్ని రోజులు పట్టొచ్చు’’ అని ఆయన చెప్పారు.