పిఆర్ అధికారుల మీద నిమ్మగడ్డ ఆగ్రహం

పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు హైకోర్టు నుంచి  అనుమతి లభించాక ఎపి ఎస్ ఇ సి చీఫ్ రమేష్ కుమార్ ప్రభుత్వాధికారులతో ఎన్నికల నిర్వహణ సమావేశాలు జరపాలనుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఈ మధ్యాహ్నం ౩గంటలకు పంచాయతీ రాజ్ శాఖ అధికారలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, అధికారులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.

దీనితో ఆయన బాగా అసంతృప్తికి గురయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం పంచాతీయ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. దీనితో పోలీసు అధికారులు, రెవిన్యూ సిబ్బంది కూడా ఇదే దారిపట్టారు. అందుకే వీళ్లంతా కమిషన్ మీద ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి విమర్శలు చేసి, ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అయితే ఇపుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులంతా ఇరుకున పడ్డారు

ఒక వైపు రమేష్ కుమార్ మాట వినవద్దని ప్రభుత్వం నుంచి వత్తిడి ఉంది. రమేష్ కుమార్ మాట వింటే, ఆయన ఏప్రిల్ లో వెళ్లిపోయాక ప్రభుత్వంతో సమస్య వస్తుంది. ఈ సంకట పరిస్థితి రాష్ట్రంలో అధికారులందరికి ఎదురవుతూ ఉంది.

ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ ఈ రోజు తొలి సమావేశం ఏర్పాటుచేశారు.  , పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తో పాటు మిగతా అధికారులంతా సమావేశానికి రావాలి. కాని వారు రాలేదు. దీనితో ఆగ్రహించిన కమిషనర్ గిరిజా శంకర్  కు మెమో జారీ చేశారు. సాయంత్రం 5గంటలకు సమావేశానికి తప్పక హాజరు కావాలని మెమో జారీ చేశారు.

ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశానికి రావాలని మెమోలో పేర్కొన్నారు.

మొదట ఉదయం 10గంటలకు తొలుత సమావేశం ఏర్పాటు చేశారు.  సీఎం తో సమావేశం ఉందని ఆమె చెప్పడంతో మధ్యాహ్నం ౩గంటలకు సమావేశం సమయం మార్చారు. ఆ సమయానికి సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆగ్రహంతో కమిషనర్  మెమో జారీ చేశారు.

ఇక నుంచి ఇతర అధికారులతో సమావేశాలు ఎలా ఉంటాయో చూడాలి. ముఖ్యంగా పోలీసు అధికారులతో సమావేశాలు సాగుతాయో లేదా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *