Home Breaking స్కూళ్లలో కొరత ఉందా? ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్: జగన్ ఆదేశాలు

స్కూళ్లలో కొరత ఉందా? ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్: జగన్ ఆదేశాలు

379
0
ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ పాఠశాలల వసతుల  మీద ఫిర్యాదు చేసేందుకు ఒక టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ ను  ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలని ఆయన చెప్పారు.  విద్యార్థులు బోధనలో తమకు ఎదరయ్యే సమస్యను, అర్థం కాని విషయాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా ఈ యాప్ లో  వీడియో కాల్‌ సదుపాయం కూడా   ఉండేలా చూడాలని ఆయన సూచనలిచ్చారు. ఇలాంటి ప్రయోగం దేశంలో ఇదే మొదటి సారి.
పాఠశాలలు పరిశుభ్రంగా, అలాగే బాత్‌రూమ్స్‌ కూడా శుభ్రంగా ఉంచడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచనలిచ్చారు. టీచింగ్ దగ్గిర నుంచి వసతుల దాకా పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉండటానికి వీల్లేదని, ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసేలా నెంబరును అందరికి తెలిసేలా ప్రదర్శించాలని ముఖ్య మంత్రి  ఆదేశించారు.

ఈ స్టోరీ మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి

బడి సమస్యల మీద ఇక నుంచి  తల్లిదండ్రులెవరైనా  ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే పరిస్థితి ఉండాలని ఆయన చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని సమీక్షిస్తూ    వైయస్‌.జగన్‌ ఈ ఆదేశాలు జారీచేశారు. విద్యాశాఖ  మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.

ఈ  సమావేశంలో ముఖ్యమంత్రి పలుసూచనలు చేశారు.
విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని,  ఏయే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.  ఎవర్నీ ఇబ్బందులకు గురిచేయకుండా పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఇక నుంచి ప్రభుత్వ బడి నాసిరకం కాదు, క్వాలిటి: నొక్కిచెప్పిన జగన్

అధికారులు అంతా కూర్చొని టీచర్ల రీ పొజిషన్‌కు పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో విధివిధానాలు రూపొందించాలని చెబుతూ  2017లో అనుసరించిన పద్దతులు కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్‌ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలావరకుఎలా మూతబడ్డాయో ముఖ్యమంత్రి వివరించారు.
‘ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఎలా పంపాలన్న కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయి.  దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగింది.  అక్టోబరు, నవంబరు నెలలు వచ్చినా యూనిఫారమ్స్, పుస్తకాలు ఇవ్వలేదు.’ అని ముఖ్యమంత్రి అన్నారు.
.ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న   గవర్నమెంటు స్కూలు అంటే నాసికరం కాదు,  గవర్నమెంటు అంటే క్వాలిటీ అన్న పేరురావాలని ముఖ్యమంత్రి చెప్పారు.
గోరుముద్ద కింద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని, వీటికిచ్చే పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఎండకూడదని ఆయన నొక్కి చెప్పారు.
జగనన్న విద్యా కానుక కోసం ఈనెల 8, 9 తేదీలలో షూష్ కోసం విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారుల ముఖ్యమంత్రికి తెలిపారు.