రాష్ట్రాంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లు : జగన్

ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్బంగా రూ.1510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌లకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చ్యువల్ విధానంలో  సీఎం  వైయస్‌.జగన్‌ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనాలుగు ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
మన మత్స్యకారులు అతి తక్కువ జీతానికి ఎక్కడో వున్న గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ బతుకు దెరవు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న వారిని… పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపితే, అక్కడ మనవాళ్లు మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు మరో అడుగు మందుకు వేసి అటు మత్స్యకారుల జీవితాలు, ఇటు రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమ రూపురేఖలను కూడా మార్చేందుకు ఈ రోజు 4 ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌లకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దాదాపు రూ.1510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, తూర్పుగోదావరిజిల్లా ఉప్పాడ, గుంటూరుజిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్‌ లకు నేడు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్ 15 నాటికి ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, పనులు కూడా ప్రారంభమవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరిజిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లును ఏర్పాటు చేస్తున్నాం.
మత్స్య, ఆక్వా రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి, నైపూణ్యం పెంచడానికి, పశ్చిమగోదావరి జిల్లాలో ఎపి ఫిషరీస్ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి ఆర్డినన్స్ జారీ చేశాం. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ పనులు ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *