Home Breaking విఆర్ వొ ల ప్రమోషన్లకు ఉమ్మడి కృషి, ఎపి రెవిన్యూ ఉద్యోగుల నిర్ణయం

విఆర్ వొ ల ప్రమోషన్లకు ఉమ్మడి కృషి, ఎపి రెవిన్యూ ఉద్యోగుల నిర్ణయం

290
0

రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల ప్రయోజనాలకు భంగం లేకుండా గ్రామ రెవిన్యూ అధికారులకు ప్రమోషన్లు కల్పించాలని ఈ రోజు ఎపి ఆర్ ఎస్ ఎ (APRSA), VRO సంఘాలు సంయుక్తంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

రెండు సంఘాలు తమ మధ్య ఉన్న అపోహలను తొలగించుకుని సంయుక్తంగా ప్రమోషన్లకోసం కృష్టి చేయాలని  ఈ రోజు ఒక అంగీకార పత్రం మీద సంతకాలు చేశాయి.

నిజానికి ఈ రెండు సంఘాల మధ్య చాలా కాలంగా సఖ్యత లేకుండా ఉండింది. విఆర్ ఒ కు ప్రమోషన్లు రాకుండా ఎపిఆర్ ఎస్ ఎ అడ్డుకుంటూ ఉందన్న అపోహ విఆర్ ఒ సంఘ సభ్యుల మధ్య ఉండింది. తమ ప్రయోజనాలకు హాని జరుగుతుందని విఆర్ ఓలు అనుమానిస్తూ వచ్చారు. ఇపుడు ఈ అపోహలను తొలగించుకుని రెండు సంఘాలు దగ్గిరయ్యాయి.

ఉద్యోగసంఘాల మధ్య సఖ్యత లేకపోవడంతో రెవెన్యూ శాఖలో కీలకముగా పని చేస్తునటువంటి గ్రామ రెవెన్యూ అధికారుల  పదోన్నతులు గత మూడు సంవత్సరములు గా తర్జన భర్జనలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రమోషన్లలొ  తీవ్రమైన ప్రతి స్టంభన నెలకొంది.

వి.ఆర్.ఓ  పదోన్నతులకు APRSA ఏనాడూ అడ్డు చెప్పలేదని పైగా గ్రామ రెవెన్యూ అధికారులను తమ సొంత కుటుబ సభ్యులుగానే భావిస్తున్నామని, వారి పధోన్నతి కల్పించేందుకు తమకు అభ్యంతరం గతంలో లేదు, ఇపుడూ లేదని ఈ రోజు జరిగిన సమావేశంలో APRSA స్పష్టంచేసింది.

AP VRO సంఘాలు గతంలోనే కుదుర్చుకున్న  అంగీకారపత్రంతో రెవెన్యూ శాఖ జూనియర్ సహాయకులు / టైపిస్టుల ప్రయోజనలు దెబ్బతినకుండా VROలకు పధోన్నతులు చేపట్టేందుకు ఎటువంటి అభ్యంతరములు లేవని గతంలోనే స్పష్టం చేసిన విషయాన్నిAPRSA నేతలు స్పష్టం చేశారు.

రెండు సంఘాల మధ్య అపోహలు కలిగేందుకు ఆనాటి ఉద్యోగ సంఘాల నేతలు కారణమని ఇరుపక్షాలు అంగీకరించాయి. నాటి నేతలే VRO సంఘనాయకులకు లేని పోనీ అపోహలు కలగించారని, ఆనాటి ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాకుండా ఆగిపోయేందుకు ఇదేకారణమని ఇరుపక్షాలు అంగీకరించాయి.

నేటి ప్రభుత్వం ఇరువర్గాలకు నష్టం కలుగకుండా G.O.Ms.No. 132 (08.05.2020 ) విడుదల చేసినా,  ఈ   ఉతర్వులపై VRO సంఘ నాయకులు అసంతృప్తితో వ్యక్తం చేయడం, దానిని కొందరు నాయకులు తమ స్వార్ధ ప్రయోజనలకోసం ఉపయోగించుకోవడం వల్ల  ప్రమోషన్లప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చిందని ఇరు వర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి.

ఇరు వర్గాలకు నష్టం లేకుండా జివొని సవరించకుండా వాయిదాపడటం కూడా ఈ పరిస్థితులే కారణమని ఇరువర్గాలు అంగీకరించాయి.

కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే తాము APRSA ను దూరము చేసుకోవడం జరిగిందని, దాని వల్లనే నేడు ఈ పరిస్థితి దాపురించినదని విఆర్ వొ సంఘ నేతలు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే తీవ్రముగా నస్ట్టపోయామని వారు గ్రహించామని, అనంతరం  జిల్లా నాయకత్వాలతో  చర్చలు జరిపడం జరిగిందని, ఈ చర్చలు సఫలం కావడంతో  APRSA తో చేతులు కలపాలని నిర్ణయించామని వారు తెలిపారు.

ఇక ముందు పధోన్నతుల విషయంలో ఏకతాటిపై నడిచి వాటిని వెంటనే సాదించుకోవాలని విఆర్ వొ సంఘాలు నిర్ణయించాయని వారు వెల్లడించారు. స్వార్ధపూరిత నాయకుల కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాలని నిర్ణయించామని వారు తెలిపారు.

ఇందులో భాగంగా నేడు ఎపి ఆర్ ఎస్ ఎ, విఆర్ వొ సంఘాల ప్రధాన నాయకుల మధ్య చర్చలు జరిగాయి.

ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ సహాయకులకు నష్టం కలగకుండ, జూనియర్ సహాయకుల స్కేలు పొందుతున్న VRO లకు నేరుగా సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని కోరాలని నిర్ణయిండం జరిగింది.

ఇదే విధంగా ప్రస్తుతం VRO పదోన్నతులపై ఇచ్చిన G.O.Ms. No.132కు కొన్ని సవరణలు అవసరమని కూడా సమావేశం నేతలు భావించారు.

ఈ మేరకు APRSA– AP VRO సంఘాలు సంయుక్తం గా ‘అంగీకార పత్రం’ మీద సంతకాలు చేశాయి.

రెండు సంఘాల అభ్యర్థన మేరకు పదోన్నతులపై ఉన్న ప్రతిష్టంభనని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించాయి.

ఈ మేరకు APRSA నేతలు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణ మూర్తి,AP  VRO అసోసియేషన్ నేతలు K. అంజనేయకుమార్ (చంటి) , Ch.సురేశ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here