అంతర్రాష్ట్ర ట్రావెల్ కు అనుమతించని ఆంధ్ర: డిజిపి ప్రకటన

అంతరాష్ట్ర రాక పోకలపై షరతులు కొనసాగుతాయని రాత్రి పొద్దు పోయాకా ఆంధ్ర ప్రదేశ్  డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ అంతర్రాష్ట్ర ప్రయాణాల ఆంక్షలను ఎత్తివేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా తటపటాయిస్తున్నది. ఇప్పటికే వేలాది ఇతర రాష్ట్రాల హైదరాబాద్ లోచక్కుకుని ఉన్నారు. ముఖ్యంగా  ఆంధ్ర ప్రదేశ్ వారు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉన్నారు. వీరంతా తమ రాష్ట్రానికి వెళేందుకు ఆత్రంగా  ఎదురు చూస్తున్నపుడు ఇతర రాష్ట్రాలలో ఉన్నవారిని ఆంక్షలు లేకుండా ఆంధ్రలోకి అనుమతించడం సాధ్యం  కాదని డిజిపి ప్రకటించారు.
డిజిపి ప్రకటన ఇదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలిక లపై తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణీకులు ఖచ్చితంగా spandana పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించగలరు.
కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు home quarantine లో ఉండాల్సిన అవసరం ఉంటుంది.
కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు institutional quarantine లో ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. Positive వొచ్చిన యెడల కోవిడ్ హాస్పిటల్ కు, negative వొచ్చిన యెడల మరో ఏడు రోజులు హోమ్ quarantine కు వెల్లవలసి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయి. ప్రయాణీకులు గమనించగలరు